పథకం పెట్టినప్పుడు లాభం కోరుకుంటాం

పథకం పెట్టినప్పుడు లాభం కోరుకుంటాం

హుజురాబాద్ బై ఎలక్షన్ ఉందనే అక్కడ దళితబంధు పథకాన్ని మొదలు పెడుతున్నామని చెప్పారు సీఎం కేసీఆర్. టీఆర్ఎస్ పక్కా రాజకీయ పార్టీ అని... పథకం పెట్టినప్పుడు లాభం కోరుకుంటామన్నారు. హుజూరాబాద్ కాంగ్రెస్ మాజీ నేత పాడి కౌశిక్ రెడ్డి కి గులాబీ కండువా కప్పి టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు సీఎం. దళితులకు ఇంటికో పది లక్షలిస్తామని.. వాటిని ఎలా వినియోగిస్తారన్నదానిపై పర్యవేక్షణ ఉంటుందన్నారు. కొందరు నేతలు అడ్డం పొడుగు మాట్లాడుతున్నారని పైరయ్యారు కేసీఆర్. కరీంనగర్ జిల్లా తనకు రాజకీయంగా సెంటిమెంట్ అని.... అందుకే దళిత బంధు స్కీంకు హుజురాబాద్ ను ఫైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామని చెప్పారు సీఎం.