వీడియో: తమన్నా డ్యాన్స్ చూస్తే కళ్లు తిప్పుకోలేరు!

వీడియో: తమన్నా డ్యాన్స్ చూస్తే కళ్లు తిప్పుకోలేరు!

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ తమన్నా భాటియాకు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. లేటు వయసులో తన అందంతో ప్రేక్షకుల హార్ట్‌ను షేక్ చేస్తున్న మిల్కీ బ్యూటీ.. పరిణతితో కూడిన నటన, చురకైన డ్యాన్స్ స్టెప్పులతో అందరి మనస్సుల్లో మంచి స్థానం సంపాదించుకుంది. అందుకే బడా హీరోలు తమన్నా తమ సినిమాలో లేకుంటే కనీసం ఆమెతో ఓ స్పెషల్ సాంగ్‌ చేయిస్తుంటారు. ఈ విషయాన్ని పక్కనబెడితే.. తమన్నా డ్యాన్స్ చేసిన ఓ వీడియో నెట్‌లో వైరల్ అవుతోంది. డోజా కాట్, ఓ బాయ్ కలసి పాడిన ‘కిస్ మీ మోర్’ అనే పాటకు తమన్నా వేసిన స్టెప్పులు చూస్తే ఎవ్వరైనా వావ్ అనాల్సిందే. కొరియోగ్రాఫర్ షజియా సమ్జీతో కలసి హుషారైన స్టెప్పులతో తమన్నా మన మనసులు మరోసారి కొల్లగొట్టిందనే చెప్పాలి. ఇంకెందుకు ఆలస్యం, తమన్నా స్టెప్స్‌ను మీరూ ఎంజాయ్ చేయండి..