టీ20ల్లో పాండ్యాపై ఎక్కువగా ఆధారపడుతున్నాం

టీ20ల్లో పాండ్యాపై ఎక్కువగా ఆధారపడుతున్నాం

టీ20ల్లో హార్దిక్ పాండ్యాపై టీమిండియా ఎక్కువగా ఆధారపడుతోందని వెటరన్ ప్లేయర్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు. ఈ ఏడాది అక్టోబర్‌‌లో పొట్టి ఫార్మాట్‌లో వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో భారత జట్టు మెరుగుపడాల్సిన తీరు గురించి లక్ష్మణ్ పలు సూచనలు చేశాడు. ఈ టోర్నీలో టీమిండియా తరఫున పాండ్యా ఫినిషర్ రోల్ వహిస్తాడని, అతడ్ని మించిన ప్రత్యామ్నాయం లేదన్నాడు. అయితే పాండ్యాపై ఎక్కువగా ఆధారపడటాన్ని టీమ్ తగ్గించాలన్నాడు.

‘టీ20 ప్రపంచ కప్‌‌లో జట్టును సమతూకంగా ఉండేలా చూసుకోవాలి. అయితే భారత్ రెండు ఏరియాల్లో బలంగా తయారవ్వాల్సి ఉంది. ఒకటి ఫినిషర్ పవర్‌‌ఫుల్‌‌గా ఉండాలి. మనం హార్దిక్ పాండ్యా మీద ఎక్కువగా ఆధారపడుతున్నాం. హార్దిక్‌‌ను మినహాయిస్తే.. ఫినిషర్‌‌గా మరో ప్లేయర్‌‌ కనిపించడం లేదు. కేఎల్ రాహుల్ రూపంలో మంచి హిట్టర్ ఉన్నా.. అతడికి టాప్ పొజిషన్‌‌లో ఆడే చాన్సెస్ వస్తున్నాయి. టెస్టుల్లో పవర్ హిట్టింగ్‌‌తో ఆకట్టుకుంటున్న రిషబ్ పంత్‌‌ను ఫినిషర్‌‌గా వాడుకోవచ్చు. ఇన్నింగ్స్ చివర్లో పాండ్యాతో కలసి పాండ్యా భారీ షాట్లతో విధ్వంసం సృష్టించగలడు’ అని లక్ష్మణ్ చెప్పాడు.