చౌటుప్పల్ మండలంలో మేం అనుకున్న మెజార్టీ రాలేదు : రాజగోపాల్ రెడ్డి

చౌటుప్పల్ మండలంలో  మేం అనుకున్న మెజార్టీ రాలేదు : రాజగోపాల్ రెడ్డి

చౌటుప్పల్ మండలంలో తాము అనుకున్న మెజార్టీ రాలేదని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఇప్పటివరకైతే టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉందన్న ఆయన.. రౌండ్ రౌండ్ కు ఫలితాలు మారుతున్నాయని చెప్పారు. చివరి వరకు హోరాహోరీ పోరు తప్పక పోవచ్చని అభిప్రాయపడ్డారు. బీజేపీ గెలుస్తుందనే నమ్మకం మాత్రం ఉందని ధీమా వ్యక్తం చేశారు.

మునుగోడు ఉపఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న మునుగోడు ఉప ఎన్నికలో విజేత ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. నెల రోజుల ఉత్కంఠకు నేడు తెర పడనుంది. ఉప ఎన్నికలో తమదే విజయమని ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రౌండ్ల తర్వాత 613 ఓట్లతో టీఆర్ఎస్ అధిక్యంలో ఉంది.