జమ్మికుంట మున్సిపాలిటీకి రూ.42కోట్లు కేటాయించాం

 జమ్మికుంట మున్సిపాలిటీకి రూ.42కోట్లు కేటాయించాం

కరీంనగర్ జిల్లా: జమ్మికుంట మున్సిపాలిటీకి రూ.42కోట్లు కేటాయించామని తెలిపారు  ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి. గురువారం ఆయన  జమ్మికుంటలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ  వరద కాలువను , స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కౌశిక్ రెడ్డి.. జమ్మికుంట పట్టణంలోని సమస్యలను స్వయంగా పరిశీలించామన్నారు. ఇంతకు ముందు జమ్మికుంటను దుమ్ముకుంట అనే వారని.. ఇక్కడ మంత్రిగా, శాసన సభ్యుడిగా ఎనిమిదేళ్లు పని చేసిన ఈటల రాజేందర్ ఒక్క సమస్య పరిష్కరించలేదన్నారు.  హౌసింగ్ బోర్డు మునుగకుండా పకడ్బందీ చర్యలు చేపడుతామని.. జమ్మికుంటకు మరో రూ.4కోట్లు నిధులు తీసుకు వస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేసిన సమయంలోనూ సమస్య పరిష్కరించలేదన్నారు. వైద్యులు, సిబ్బంది కొరతను మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లామని.. త్వరలోనే ఇక్కడ డాక్టర్లను నియమించి 24గంటల వైద్య సౌకర్యం కల్పిస్తామని హామి ఇచ్చారు.