ప్రాధాన్యత రంగాలకు రూ.1,937 కోట్ల రుణాలిచ్చాం.. భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్శర్మ

ప్రాధాన్యత రంగాలకు రూ.1,937 కోట్ల రుణాలిచ్చాం.. భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్శర్మ

భూపాలపల్లి అర్బన్, వెలుగు: ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రాధాన్యత  రంగాలకు రూ.2,971.20 కోట్ల రుణాలకు గాను ఇప్పటివరకు రూ.1,937.21 కోట్ల రుణాలు ఇచ్చామని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. గురువారం ఐడీవోసీ కార్యాలయంలో లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో జిల్లా కన్సల్టేటివ్, రివ్యూ కమిటీ , ఇంప్లిమెంటేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు.  

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్దేశించిన లక్ష్యాల మేరకు రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లకు సూచించారు. మున్సిపల్, గ్రామ పంచాయతీ పరిధిలో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించేందుకు కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. ఎమ్మెల్యే సత్యనారాయరావు, మున్సిపల్ చైర్​పర్సన్ బుర్ర కొమురయ్య, ఆర్బీఐ ఎల్​డీవో యశ్వంత్ సాయి, నాబార్డ్ డీడీఎం చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.