అక్రమ మైనింగ్‌‌ చేసే వాళ్లకు నోటీసులు ఇచ్చాం : ప్రభుత్వం

అక్రమ మైనింగ్‌‌ చేసే వాళ్లకు నోటీసులు ఇచ్చాం : ప్రభుత్వం

హైకోర్టుకు ప్రభుత్వం వెల్లడి

హైదరాబాద్, వెలుగు: నిజామాబాద్‌‌ జిల్లా మాక్‌‌లూరు మండలం మామిడిపల్లి ఫారెస్ట్‌‌ ఏరియాలో అక్రమ మైనింగ్‌‌ చేసే వాళ్లకు నోటీసులు ఇచ్చామని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. సీనరైజ్‌‌ ఫీజు 5 రెట్లు ఎక్కువ చెల్లించాలని కె.వేణుగోపాల్, ప్రగతి స్టోన్‌‌ క్రషర్స్, ఉమా మహేశ్వర స్టోన్‌‌ క్రషర్స్, ఎం.రామేశ్వర్‌‌రెడ్డి, ఆదిశక్తి కన్‌‌స్ట్రక్షన్స్‌‌లకు నోటీసులు ఇచ్చినట్లు చెప్పింది.

మైనింగ్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ అసిస్టెంట్‌‌ డైరెక్టర్‌‌ బి.సత్యనారాయణ హైకోర్టుకు స్వయంగా హాజరై స్టేటస్‌‌ రిపోర్టు ఇచ్చారు. దీనిని పరిశీలించిన చీఫ్‌‌ జస్టిస్‌‌ ఉజ్జల్‌‌ భూయాన్, జస్టిస్‌‌ సీవీ భాస్కర్‌‌ రెడ్డిల డివిజన్‌‌ బెంచ్‌‌ సంతృప్తిని వ్యక్తం చేసింది. దీంతో అక్రమ మైనింగ్‌‌పై 2014లో దాఖలైన పిల్‌‌పై విచారణను ముగిస్తున్నట్లు చెప్పింది.