పార్లమెంట్ ఎన్నికలకు పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేశామని నల్లగొండ జిల్లా ఎస్పీ చందన దీప్తి తెలిపారు. ప్రజలు ఓటు హక్కు ప్రశాంత వాతావరణంలో వినియోగించుకునేలా పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాటు చేశామని వెల్లడించారు. జిల్లాలో శాంతి యుత వాతవారణంలో ఎన్నికలు నిర్వహించడానికి ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, 9 మంది డిస్పీలు,37 మంది సీఐలు,84 మంది యస్.ఐలతో కలిపి మొత్తం 3000 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నట్టు చెప్పారు.
7 కంపెనీల కేంద్ర బలగాలు, 5 ప్లాటున్ల TSSP సిబ్బంది,పెట్రోలింగ్ పార్టీలు, క్విక్ రియాక్షన్ టీమ్స్ (QRT), స్ట్రయికింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రయికింగ్ టీమ్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 313 సమస్యత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కేంద్ర పార మిలటరీ బలగాల ద్వారా పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు చందనా దీప్తి.
