తెలంగాణను మార్చే శక్తి మనలో ఉంది: ఆకునూరి మురళి

తెలంగాణను మార్చే శక్తి  మనలో ఉంది: ఆకునూరి మురళి

హైదరాబాద్, వెలుగు:  తెలంగాణలో సహజ, ఆర్థిక వనరుల దోపిడీ జరుగుతోందని, దానికి అడ్డుకట్ట వేయాలని సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ సుదర్శన్ రెడ్డి అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 12వ స్మారకోపన్యాస స్ఫూర్తి సదస్సును ఆదివారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ నాంపల్లిలోని మదీనా ఎడ్యుకేషనల్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో సహజ వనరుల దోపిడీ ఏ విధంగా జరిగిందో, జరుగుతుందో విద్యావంతులు తమకు తాము ప్రశ్న వేసుకోకపోతే ముందుకెళ్లడం సాధ్యం కాదన్నారు. ‘‘ఈ సమాజానికి చెందిన సహజ వనరులు ఎవరి చేతిలో ఉన్నాయి. వీటిని ప్రజలకు చెందేటట్లు ఏం చేయాలో ఆలోచన చేయాలి. దోపిడీదారులను, వారికి వత్తాసు పలుకుతున్న వారిని దోషులుగా తెలంగాణ సమాజం ముందు ఉంచాలి. పాలకులు మన యాసను, భాషను పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేస్తున్నారు. పౌర సమాజం ఎలా నడుచుకోవాలో విద్యావంతుల వేదిక ప్రణాళిక చేస్తే బాగుంటుంది”అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా జయశంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. 

రాష్ట్రంలో అంతర్గత దోపిడీ : హరగోపాల్‌‌‌‌‌‌‌‌

త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణలో ఫలితా లు ఆశాజనకంగా లేవని ప్రొఫెసర్ హర గోపాల్ అన్నారు. కర్నాటక తరహాలో పౌర సమాజం పని చేయాల్సిన అవసరముందని చెప్పారు. తెలంగాణలో అంతర్గత దోపిడీ జరుగుతోందని, దీనికి ఎదు ర్కొవడానికి సిద్ధంగా ఉండాలని ఆనాడే అనుకు న్నామని పేర్కొన్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత తెలం గాణ ఉద్యమం కంటే పెద్ద ఉద్యమం చేయాల్సి ఉంటుందని జయశంకర్ మాట్లాడిన మాటలను ఆయన గుర్తుచేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత అధికార పార్టీల నేతలు గుట్టలను కూడా వదలడం లేదన్నారు. 


దేశంలో బీజేపీ దుర్మార్గపు విధానాలు, రాష్ట్రంలో బీఆర్ఎస్ మోసపూరిత విధానాలు మితిమీరిపోతున్నాయని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి అన్నారు. శత్రువు బలంగా, తెలివిగా ఉన్నాడని, ఆయన్ని ఢీ కొట్టాలంటే కామన్ మినిమం ప్రోగ్రాం ఎజెండా ప్రిపేర్ చేసుకొని రంగంలోకి దిగాలన్నారు. ఏం చేయాలనే దానిపై అందరం కూర్చొని చర్చించి, ముందుకు సాగాలన్నారు. తెలంగాణను మార్చే శక్తి మనందరిలో ఉందన్నారు. ఢిల్లీ జేఎన్‌‌‌‌‌‌‌‌యూ ప్రొఫెసర్ అజయ్ గుడవర్తి మాట్లాడుతూ, దేశంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాకుండా కల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. -తెలంగాణలో మరో ఉద్యమం రావాల్సిన అవసరం ఉందని సీనియర్ జర్నలిస్ట్ రామచంద్రమూర్తి---పేర్కొన్నారు. 

ప్రొఫెసర్ మురళి మనోహర్ మాట్లాడుతూ, పీపుల్స్ ఎజెండాతో సామాజిక న్యాయ ప్రాతిపదికగా ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రొఫెసర్ వెంకట్ నారాయణ మాట్లాడుతూ, కార్పొరేట్‌‌‌‌‌‌‌‌లో ఉన్న పెద్ద శక్తులు, పాలకులు కలిసి రాష్ట్రాన్ని దారుణంగా దోపిడీ చేస్తున్నాయని ఆరోపించారు. ఈ సదస్సు జరుగుతుండగానే ప్రజా గాయకుడు గద్దర్ మరణ వార్త తెలియడంతో ఆయనకు సంతాపం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జెఎన్‌‌‌‌‌‌‌‌టీయూ ప్రొఫెసర్ వినయ్ బాబు, ప్రొఫెసర్ రమా మేల్కేటో, ప్రొఫెసర్ పద్మజా షా, ప్రొఫెసర్ రమ, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, సుప్రీంకోర్టు న్యాయవాది నిరూప్ రెడ్డి, వీక్షణం వేణుగోపాల్, రైతు స్వరాజ్య వేదిక నాయకులు కన్నెగంటి రవి, అరుణోదయ విమలక్క, మట్టి మనిషి పాండు రంగారావు, నర్సింహారెడ్డి, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి డేగల సారయ్య, జంపాల విశ్వ, డీఎస్ఎస్ఆర్ క్రిష్ణ, పందుల సైదులు తదితరులు పాల్గొన్నారు.