సినిమా మొత్తం నవ్వుతూనే ఉంటాం..!

సినిమా మొత్తం నవ్వుతూనే ఉంటాం..!

నాని హీరోగా వివేక్ ఆత్రేయ రూపొందిస్తున్న చిత్రం ‘అంటే.. సుందరానికీ’. నజ్రియా హీరోయిన్. మైత్రి మూవీ మేకర్స్‌‌‌‌‌‌‌‌ సంస్థ నిర్మించింది. జూన్ 10న సినిమా విడుదల కానుండటంతో ప్రమోషన్స్‌‌‌‌‌‌‌‌లో స్పీడు పెంచిన టీమ్, నిన్న టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. నాని మాట్లాడుతూ ‘ఇది నాకు స్పెషల్ మూవీ. చాలా మంచి టీమ్ పని చేశారు. ఈ కథని వివేక్ చెప్పినట్లు ఎవరూ చెప్పలేరు. నవ్వించాలని ఒక్క డైలాగ్ కూడా రాయలేదు. కథ చెబుతుంటాడంతే. కానీ సినిమా మొత్తం నవ్వుతూనే ఉంటాం. అది మ్యాజికల్‌‌‌‌‌‌‌‌గా అనిపించింది. ఇలాంటి ఫిల్మ్ నా దగ్గరకు రావడం అదృష్టంగా ఫీలవుతున్నా. నజ్రియాని తెలుగులోకి రప్పించాలని చాలామంది ప్రయత్నించారు. మా సినిమాతో ఎంట్రీ ఇస్తున్నందుకు ఆమెకి థ్యాంక్స్. టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి రెండు రెట్లు అదిరిపోతుంది ట్రైలర్. అంతకి పదిరెట్లు సినిమా వుంటుంది’ అన్నాడు. ‘మొదటి తెలుగు సినిమాకి ఇంత మంచి టీమ్‌‌‌‌‌‌‌‌తో కలసి పని చేయడం ఆనందంగా ఉంది’ అంది నజ్రియా. వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ ‘స్క్రిప్ట్ రాసినప్పుడు చాలా ఎక్సయిటయ్యాను. రాసింది రాసినట్లు వస్తే బాగుంటుందనుకున్నాను. కానీ రాసిన దానికంటే పది రెట్లు అద్భుతంగా వచ్చింది. అందుకు నా టీమ్‌‌‌‌‌‌‌‌ మొత్తానికీ థ్యాంక్స్’ అన్నాడు. ‘స్క్రిప్ట్ విన్నప్పుడే హిట్ అనుకునే సినిమాలు కొన్నే ఉంటాయి. అలాంటి సినిమానే ఇది. అవుట్‌‌‌‌‌‌‌‌పుట్ చూశాక నమ్మకం మరింత పెరిగింది’ అన్నారు నిర్మాత రవిశంకర్. సీఈవో చెర్రి, సినిమాటోగ్రాఫర్ నికేత్ బొమ్మి, ఎడిటర్ రవితేజ, ప్రొడక్షన్ డిజైనర్ లత కూడా పాల్గొన్నారు.