యుద్ధ సామగ్రి మన దగ్గర్నే తయారు కావాలె 

యుద్ధ సామగ్రి మన దగ్గర్నే తయారు కావాలె 

న్యూఢిల్లీ : దేశ రక్షణకు అవసరమయ్యే ఆయుధాల విషయంలో స్వయం సమృద్ధిగా ఉండాలని రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ చెప్పారు. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది తప్పనిసరి అని అన్నారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం కూడా మరోసారి ఇదే విషయాన్ని చాటిచెప్పిందని వివరించారు. ఆయుధాల కోసం మరొకరిపై ఆధారపడే పరిస్థితి ఎప్పటికీ ఉండొద్దన్నారు. యుద్ధ సామగ్రిని మనమే తయారు చేసుకునే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. గురువారం నేవీ కమాండర్స్ కాన్ఫరెన్స్ లో రాజ్ నాథ్ మాట్లాడారు. భవిష్యత్తులో యుద్ధాలు జరిగితే.. త్రివిధ దళాల జాయింట్ ఆపరేషన్లు కీలకమవుతాయని చెప్పారు. అందుకు అనుగుణంగా మిలటరీ కమాండ్ల పునర్నిర్మాణం, థియేటర్ కమాండ్ ల ఏర్పాటుపై దృష్టిసారించాలని సూచించారు. మారిటైమ్ థియేటర్ కమాండ్ ఏర్పాటుపై స్టడీ జరుగుతోందని తెలిపారు. ప్రతి థియేటర్ కమాండ్ లో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ యూనిట్లు ఉంటాయని వెల్లడించారు. ఇవన్నీ ఒకే యూనిట్ గా పని చేస్తాయని, ఒక ప్రాంతానికి సంబంధించిన సెక్యూరిటీ సవాళ్లపై దృష్టిసారిస్తాయని రాజ్​నాథ్​ సింగ్ చెప్పారు.