ఎయిర్ పోర్ట్ తరహాలో.. తిరుమలకు ఫ్రీ లగేజీ విధానం

ఎయిర్ పోర్ట్ తరహాలో.. తిరుమలకు ఫ్రీ లగేజీ విధానం

భక్తుల సౌకర్యార్థం టీటీడీ నూతన లగేజీ విధానం అందుబాటులోకి తెచ్చింది. ఎయిర్ పోర్టు తరహాలో లగేజీలకు ట్యాగ్ వేసి స్కానింగ్ విధానాన్ని అమలుచేస్తుంది. లగేజీ ఎక్కడుందో భక్తులకు తెలిసేలా మెసేజ్ లు పంపిస్తున్నట్లు టీటీడీ ఈవో తెలిపారు.

శ్రీవారి భక్తులకు ఎయిర్ పోర్టు తరహాలో, వారి లగేజీని తిరుపతి నుండి తిరుమలకు తరలించి ఉచితంగా అందజేస్తామనిటిటిడి..ఈఓ ధర్మారెడ్డి తెలిపారు.. గతంలో లగేజి తరలించడం, తిరిగి అప్పగించడం మ్యానువల్ పద్దతిలో నిర్వహించామని చెప్పారు.  నూతన సాంకేతిక పరిజ్ఞానంతో, ట్రాక్ ఐడీ విధానంతో సాఫ్ట్ వేర్  రూపొందించామని తెలిపారు. లగేజీ ఎక్కడ ఉందో  భక్తులు , సెల్ ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. అధునాతన గ్యాడ్జెట్స్ తో, భక్తుల లగేజీని తనిఖీ చేయవచ్చునన్నారు. హార్డ్వేర్ కు సంబంధించి క్రిస్టియన్ భక్తుడైన చార్లెస్ 2 కోట్లు విరాళంగా అందించారన్నారు...  తిరుమల అన్నమయ్య భవన్లో లగేజీ నూతన  ట్రాన్స్పోర్ట్ సిస్టంను, డెమోగా ప్రదర్శించి వివరించారు.. దాతల సహకారంతో ఈ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చామని ఈవో.. ధర్మా రెడ్డి తెలిపారు.లగేజీ కౌంటర్లలో పనిచేసే  సిబ్బందికి ప్రత్యేక డ్రెస్ కోడ్ అమలు చేస్తామన్నారు. ఇప్పటికే సిబ్బందికి నూతన విధానంపై శిక్షణ ఇచ్చామని ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

 శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం పెద్ద సంఖ్యలో కాలినడకన భక్తులు కొండకు వస్తుంటారు. అలిపిరి మెట్ల మార్గంలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు. అయితే కాలినడకన వచ్చే భక్తులు తమ లగేజీని తిరుపతి లగేజీ కేంద్రం వద్ద డిపాజిట్ చేసి, తిరుమలలో తీసుకుంటారు. కాలినడక భక్తుల లగేజీని టీటీడీ సిబ్బంది వాహనాల్లో కొండపైకి తీసుకొచ్చి అక్కడ లగేజీ కేంద్రాల్లో భద్రపరుస్తారు. భక్తులు తిరుమల చేరుకున్నాక తమ లగేజీని తిరిగి తీసుకుంటారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ మాన్యువల్ గా నిర్వహిస్తున్నారు. ఇందులో సమస్యలు తలెత్తడంతో టీటీడీ లగేజీ విధానంలో మార్పులు చేసింది.