
ట్యాంక్ బండ్, వెలుగు: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయిపై కోర్టులోనే దాడికి పాల్పడిన తీరును మాల మహానాడు తీవ్రంగా ఖండిస్తుందని జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య అన్నారు. దాడిని నిరసిస్తూ బుధవారం ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద మాల మహానాడు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన రాకేశ్ కిషోర్ చిత్రపటాన్ని చెప్పులతో కొట్టారు. చెన్నయ్య మాట్లాడుతూ.. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర న్యాయ శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బూర్గుల వెంకటేశ్వర్లు, బైండ్ల శ్రీనివాస్, కోటేశ్వరరావు, ఆనంద్ బాబు, సరళ తదితరులు పాల్గొన్నారు.