ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: మోడీ

ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: మోడీ

ఆంధ్రప్రదేశ్ అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి అన్నివిధాలా చేయూతనిస్తామని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు.  తిరుపతి కార్బన్ సెల్ ఫోన్ ఉత్పత్తి కేంద్రం ఆవరణలో బీజేపీ ఏర్పాటు చేసిన ప్రజా ధన్యవాద సభలో ప్రధాని ప్రసగించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక వెంకన్న ఆశీర్వాదం కోసం తిరుపతి వచ్చానన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన జగన్ కు మోడీ ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. ఏపీలోసుపరిపాలన అందించాలని జగన్ ను కోరుతున్నానని మోడీ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేక రంగాల్లో ముందుందని, ఏపీ ప్రజల్లో ప్రతిభా పాటవాలకు కొదవ లేదన్నారు. రాష్ట్రాభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలన్నారు. ఏపీ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏవిధంగానూ వెనుకడుగు వేయదన్నారు

తమ ప్రభుత్వంపై దేశ ప్రజల ఆకాంక్షలు పెరిగాయని, వారి ఆకాంక్షలు నెరవేరుస్తానని హామీ ఇస్తున్నానన్నారు. అవినీతి రహిత పాలన అందించామనే ప్రజలు మళ్లీ తమను ఆదరించారని మోడీ అన్నారు.