యాదాద్రి, వెలుగు : ‘ మా ఓటును డబ్బుకి, మద్యానికి అమ్ముకోం.. నిజాయితీతో గ్రామాభివృద్ధికి కృషి చేసే అభ్యర్థిని సర్పంచ్ గా ఎన్నుకుంటాం’ అంటూ యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలం జలాల్‌పూర్‌కు చెందిన పలువురు ఓటర్లు తమ ఇండ్ల ముందు బోర్డులు ఏర్పాటు చేశారు. జిల్లాలో కలెక్టర్, ఎన్నికల అధికారి హనుమంతరావు ఓటు హక్కు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో పాటు ‘ మద్యం, డబ్బుకు మా ఓటుని అమ్ముకోం. మా ఓటుతో గ్రామాభివృద్ధి చేసే అభ్యర్థిని ఎన్నుకుంటాం’ అని ఓటర్లతో ప్రతిజ్ఞ చేయిస్తున్నారు.
