ఇండియాపై దాడులు చేస్తం.. పాక్ ప్రధాని షరీఫ్ ప్రగల్బాలు

ఇండియాపై దాడులు చేస్తం.. పాక్ ప్రధాని షరీఫ్ ప్రగల్బాలు

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌‌లోని ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసినప్పటికీ, ఆ దేశానికి బుద్ధి రాలేదు. పైగా ఆ దాడులకు బదులుగా ఇండియాపై దాడులు చేస్తామని ప్రగల్బాలు పలికింది. బుధవారం రాత్రి జాతిని ఉద్దేశించి పాక్ ప్రధాని హెహబాజ్ షరీఫ్ మాట్లాడారు. ఇండియా చేసిన దాడులకు బదులుగా ప్రతిదాడులు చేస్తామని, ఆ సత్తా తమ ఆర్మీకి ఉందని హూంకరించారు.

 ‘‘ప్రతి ఒక్క మరణానికీ మేం ప్రతీకారం తీర్చుకుంటం. ఈ యుద్ధాన్ని మేం ముగింపునకు తీసుకెళ్తం. పాకిస్తాన్ ప్రజలారా.. మీ రక్షణ కోసం.. మనం, మన ఆర్మీ ఎల్లప్పుడూ కలసికట్టుగా ఉండాలి. మనం మన శత్రువుపై తప్పకుండా గెలుస్తం. మనం తప్పకుండా వాళ్లపై పోరాడి విజయం సాధిస్తం” అని పేర్కొన్నారు. ఉగ్రవాదంతో పాకిస్తానే ఎక్కువగా ప్రభావితమైందన్నారు. ఇండియా చేసిన దాడుల్లో 26 మంది చనిపోయారని, 46 మంది గాయపడ్డారని ప్రకటించారు.