అనుకున్న టైమ్‎కు మేడారం జాతర పనులు పూర్తి చేస్తం: మంత్రి పొంగులేటి

అనుకున్న టైమ్‎కు మేడారం జాతర పనులు పూర్తి చేస్తం: మంత్రి పొంగులేటి

హైదరాబాద్: అనుకున్న సమయానికి మేడారం జాతర పనులు పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం (జనవరి 4) మేడారంలో గద్దెల అభివృద్ధి పనులను మంత్రులు పొంగులేటి, సీతక్క పరిశీలించారు. అనంతరం మేడారం అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జనవరి 10వ తేదీ లోపు మేడారం అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 

బాధ్యతగా వ్యవహరించని అధికారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‎కు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. చెప్పిన టైమ్‎కు మేడారం అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని తెలిపారు. 20వ తేదీ లోపు సీఎం రేవంత్ రెడ్డి మేడారంలో పర్యటిస్తారని.. ఇక్కడే బస చేస్తారని చెప్పారు. దేశ నలుమూలల నుంచి తరలివచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.