
కేసీఆర్ ఎందుకు ఢిల్లీ వచ్చారో స్పష్టం చేయాలి.. సీఎంగా ఆయన అది ఆయన బాధ్యత అని అన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ఢిల్లీ వచ్చిన కేసీఆర్ వంగి వంగి దండాలు పెడుతున్నారు…ఢిల్లీలో ఎక్కడ యుద్ధం చేశారో చెప్పాలిని డిమాండ్ చేశారు. చేసిన తప్పుల నుంచి తప్పించుకోవాలని చూస్తున్న కేసీఆర్ ను ఎట్టిపరిస్థితిలో వదిలిపెట్టబోమన్నారు. కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయన్నారు. తెలంగాణ లో రైతులు ఆందోళన చేయకపోయినా బంద్ పిలుపిచ్చారన్న బండి సంజయ్..ఢిల్లీలో రైతుల ఆందోళనకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. కోతల కోసం మాటల కేసీఆర్ ఢిల్లీ వెళ్తారని తాను ముందే చెప్పానని అన్నారు.
హైదరాబాద్ లో వరదలు వస్తే కేసీఆర్ బయటకి రాలేదని..ప్రతి కుటుంబానికి 10 వేలు ఇస్తామని ప్రకటించి..ఇప్పటి వరకు ఇవ్వలేదని ఆరోపించారు. కాళేశ్వరం 3 TMC పేరుతో 20వేల కోట్లను దోచుకునేందుకే కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. DPR లేకుండా ప్రాజెక్టుకు అనుమతులు ఉండవని కేంద్రమంత్రి స్పష్టం చేశారని తెలిపారు. కాళేశ్వరం రెండో TMC అనుమతికి అతి త్వరగా కేంద్రం అనుమతులు ఇచ్చిందన్నారు. అనుమతుల కోసం ఇచ్చిన వివరాలు ఒకటిగా ఉంటే..ప్రాజెక్టు నిర్మాణం మరోలా ఉందన్నారు. ప్రాజెక్టు డిజైన్ ఎందుకు మార్చారో కేసీఆర్ చెప్పలేదని ప్రశ్నించారు.
ఇప్పటి వరకు ఒక్క చుక్క నీటిని కేసీఆర్ వ్యవసాయ సాగుకు ఇవ్వలేదని తెలిపారు బండి సంజయ్. అలాంటప్పుడు మూడో TMCకి అనుమతులు ఎందుకని అన్నారు. కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి అనుమతులు అడుగుతున్నారని తెలిపారు. కృష్ణా జలాల వివాదం పై కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుకు ఇప్పటి వరకు కేసీఆర్ లేఖ ఎందుకు ఇవ్వలేదన్నారు. కేంద్రం రెండు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడాలని చూస్తోందన్నారు. కేసీఆర్ మాత్రం కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్టులను నిర్మిస్తున్నారని చెప్పారు. స్మార్ట్ సిటీ పథకం కింద వరంగల్ కార్పొరేషన్ కు 196 కోట్లు కేటాయించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర వాటాకింద 196 కోట్లు ఇవ్వాలన్నారు. రాష్ట్ర వాటా ఇవ్వకుండా కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించారని తెలిపారు. దీనిపై కేంద్రం 3 సార్లు లేఖ రాసిన రాష్ట్రం స్పందించడం లేదన్నారు.
తన పాలనలో కాంట్రాక్టు ఉద్యోగులు ఉండరన్న కేసీఆర్ … కాంట్రాక్టు ఉద్యోగులను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు బండి సంజయ్. కేసీఆర్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే వరకు బీజేపీ పోరాడుతుందన్నారు. కేంద్రానికి ఎన్ని దండాలు పెట్టినా కేంద్రం ఊరుకోదని…కేసీఆర్ కు చెప్పి కేంద్ర సంస్ధల దాడులు చేయవన్నారు. కేసీఆర్ అవినీతిపై తప్పకుండా కేసులు వేస్తామన్న బండి సంజయ్… తనపై దాడి కేసుల్లో విచారణ జరుగుతోందన్నారు.