నారాయణపూర్ రిజర్వాయర్‌ నిర్వాసితులకు న్యాయం చేస్తాం: చొప్పదండి ఎమ్మెల్యే

నారాయణపూర్ రిజర్వాయర్‌ నిర్వాసితులకు న్యాయం చేస్తాం: చొప్పదండి ఎమ్మెల్యే

గంగాధర, వెలుగు: నారాయణపూర్​ రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వాసితులకు దశలవారీగా న్యాయం చేస్తామని, నారాయణపూర్ కుడికాలువ పనులు పూర్తి చేస్తామని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు.

కరీంనగర్ జిల్లా గంగాధర ఎంపీడీవో ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నారాయణపూర్ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ముంపునకు గురవుతున్న భూములు, ఇండ్లు, కట్ట ఎత్తు పెంచడం, బండ్ ​పటిష్టం, కాలువల నిర్మాణానికి సీఎం రేవంత్​రెడ్డి, ఇరిగేషన్​ మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి రూ.43.50 కోట్లు మంజూరు చేయించినట్లు తెలిపారు.

కార్యక్రమంలో గంగాధర, బోయినపల్లి మండలాల సర్పంచుల ఫోరం అధ్యక్షులు నగేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, భీంరెడ్డి మహేశ్వర్​రెడ్డి, సర్పంచులు భాస్కర్, ప్రభాకర్​రెడ్డి, శ్రీనివాస్, శ్రీనివాస్​గౌడ్, కనకయ్య, రమేశ్​ పాల్గొన్నారు.