హ్యాట్రిక్ లోడింగ్ 3.0.. సంబురాలకు సిద్ధమవ్వండి: కేటీఆర్

హ్యాట్రిక్  లోడింగ్ 3.0..  సంబురాలకు సిద్ధమవ్వండి: కేటీఆర్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని మరోసారి మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.  డిసెంబర్ 3వ తేదీ ఆదివారం రానున్న ఎన్నికల ఫలితాల్లో గెలిచేది మేమే..రాష్ట్రంలో మూడోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారం  చేపట్టబోతోందని మంత్రి కేటీఆర్ డిసెంబర్ 2వ తేదీ శనివారం రాత్రి ట్వీట్ చేశారు. హ్యాట్రిక్  లోడింగ్ 3.0  అంటూ.. గన్ తో గురిపెట్టిన ఫోటను కేటీఆర్ కొద్దిసేపటిక్రితమే తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. రేపు సంబురాలు చేసుకునేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.