కోటి ఇళ్లకు.. 300 యూనిట్ల విద్యుత్ ఉచితం

కోటి ఇళ్లకు.. 300 యూనిట్ల విద్యుత్ ఉచితం

ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సంచలన ప్రకటన చేశారు. రూఫ్‌ టాప్‌ సోలార్‌ పాలసీ విధానం కింద కోటి ఇళ్లపై సోలార్ సెటప్స్ ఏర్పాటు చేస్తామన్నారు.  ప్రతి ఇంటికి 300 యూనిట్ల సోలార్‌  విద్యుత్‌ ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. దీని వలన ప్రతి కుటుంబానికి ఏటా రూ.15 నుంచి 18 వేలు  ఆదా అవుతుందన్నారు.  వినియోగం పోగా మిగిలిన విద్యుత్ ను పంపిణీ సంస్థలకు విక్రయించవచ్చునని తెలిపారు.  

ఇక మధ్య తరగతి కోసం కొత్తగా గృహ నిర్మాణ విధానం తీసుకురాబోతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. బస్తీలు, అద్దె ఇండ్లల్లో ఉండే వారి సొంతింటి కలను నెరవేరుస్తామన్నారు.   ఇంటి నిర్మాణానికి, కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇస్తుందని తెలిపారు.  గ్రామీణ ప్రాంతాల్లో పీఎం ఆవాస్‌ యోజన ఇండ్లలో 70శాతం మహిళల పేరుపైనే ఇచ్చామని గుర్తుచేశారు సీతారామన్.  

మరోవైపు దేశవ్యాప్తంగా ఉన్న  అంగన్వాడీ,ఆశా వర్కర్లు, హెల్పర్లను  ఆయష్మాన్  భారత్ కిందకు తీసుకువస్తున్నామని నిర్మలా సీతారామన్  ప్రకటించారు.  9- నుంచి18 ఏళ్ల బాలికలు సర్వైకల్‌ క్యాన్సర్‌ బారిన పడకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.  ప్రస్తుతం  ఆయష్మాన్  భారత్ కింద ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమా సదుపాయం కల్పిస్తో్ంది కేంద్రం.