కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులిస్తే హక్కులు కోల్పోతం : కేసీఆర్

కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులిస్తే హక్కులు కోల్పోతం :  కేసీఆర్

హైదరాబాద్, వెలుగు:  కృష్ణా బోర్డుకు శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులను అప్పగిస్తే రాష్ట్ర హక్కులను కోల్పోతామని బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ తనను కలిసిన నేతలతో అన్నారు. శనివారం నందినగర్లోని నివాసంలో మాజీ మంత్రులు జగదీశ్రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ వెంకట్రామ్రెడ్డి, మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రవీంద్రకుమార్, చిరుమర్తి లింగయ్య తదితరులు కేసీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్వారితో కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతతో పాటు పలు అంశాలపై చర్చించినట్టు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం ఎంత ఒత్తిడి చేసినా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టులను అప్పగించడానికి ఒప్పుకోలేదని కేసీఆర్ పేర్కొన్నారని సమాచారం.

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమని, ప్రజాతీర్పును గౌరవిస్తూ ప్రతిపక్ష పాత్రలో పని చేద్దామని సూచించారని తెలిసింది. బీఆర్ఎస్ ప్రభుత్వమే ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకున్నదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అసలు నిజాలేంటో ప్రజలకు వివరిద్దామని వారితో చెప్పినట్టు తెలిసింది. దీనిపై రెండు, మూడు రోజుల్లోనే ముఖ్య నేతలతో సమావేశమై, ఉద్యమ కారాచరణ రూపొందిద్దామని తెలిపారని సమాచారం. 

కేసీఆర్​ను కలిసిన దిల్ రాజు

సినీ నిర్మాత దిల్రాజు కేసీఆర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. తన తమ్ముడు శిరీశ్రెడ్డి కుమారుడు అశీష్రెడ్డి వివాహానికి రావాలని ఆహ్వానించారు.