2022లోనూ ప్రజలంతా మాస్క్ లు పెట్టుకోవాల్సిందే

2022లోనూ ప్రజలంతా మాస్క్ లు పెట్టుకోవాల్సిందే

దేశాన్ని కరోనా వదిలిపెట్టలేదు. థర్డ్ వేవ్ వస్తుందని ఎక్స్ పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. అయినా జనం మాత్రం పట్టించుకోవడంలేదు. నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. అయితే కరోనా ఇప్పట్లో  వదలబోదని ఇన్ డైరెక్టుగా చెప్పారు నీతి ఆయోగ్ హెల్త్ మెంబర్ డాక్టర్ VK పాల్. 2022లోనూ ప్రజలంతా మాస్క్ లు పెట్టుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ల కాంబినేషన్ పై అధ్యయనం జరగాలన్నారు. అయితే మందులు వస్తే తప్ప కరోనాను అడ్డుకోలేమని తేల్చి చెప్పారు. దేశంలో ప్రమాదకర పరిస్థితుల్లోకి అడుగపెడుతోందన్నారు VK పాల్. అనేక పండగలు ముందున్నాయని... అందుకే జాగ్రత్తగా ఉండడం తప్పనిసరి అని చెప్పారు. 2022లో కూడా కచ్చితంగా మాస్క్ పెట్టుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు. పండగలను కరెక్ట్ గా మేనేజ్ చేయలేకపోతే... భారీ దెబ్బ తప్పదన్నారు.

వ్యాక్సిన్స్ కాంబినేషన్, మందులు, క్రమశిక్షణ  కలిగిన ప్రవర్తన మాత్రమే కరోనాను అడ్డుకోగలదని చెప్పారు. కరోనా వ్యాధి విస్తరణను అడ్డుకోవడానికి మందులు కావాలన్నారు VK పాల్. త్వరలోనే కొవాగ్జిత్ తో పాటు భారత్ లో అభివృద్ధి చేసిన ఇతర వ్యాక్సిన్లకు కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అప్రూవల్ వస్తుందని నమ్ముతున్నట్టు పాల్ చెప్పారు. అయితే థర్డ్ వేవ్ వచ్చే అవకాశాన్ని కొట్టిపారేయలేమన్నారు. అయితే వచ్చే మూడు,నాలుగు నెలల్లో వ్యాక్సినేషన్ ద్వారా డెవలప్ అయ్యే ఇమ్యూనిటీ కరోనాను అడ్డుకోగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.