హైదరాబాద్: కోర్టు ఆదేశాలతో కరోనా బులిటెన్ ను రేపటి నుంచి రిలీజ్ చేస్తామన్నారు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు. 60ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు… పదిహేను వందల వ్యాక్సినేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. 45 ఏళ్లు పైబడిన వారికి బీపీ, షుగర్, కేన్సర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నా… అనుమానం లేకుండా వ్యాక్సిన్ తీసుకోవచ్చన్నారు. వ్యాక్సిన్ కోసం కోవిన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నవారితో పాటు వాక్ ఇన్ లో కూడా వ్యాక్సిన్ ఇస్తామని తెలిపారు శ్రీనివాస్ రావు.
