ముంపు గ్రామాల సమస్యలు పరిష్కరిస్తాం

ముంపు గ్రామాల సమస్యలు పరిష్కరిస్తాం

రాజన్న సిరిసిల్ల జిల్లా:  మల్కాపేట రిజర్వాయర్  పూర్తి కాగానే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. ముంపు గ్రామాల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని.. త్వరలోనే పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. కొనరావుపేట మండలం మల్కాపేటలో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా చల్మెడ జానకి దేవి స్మరకార్థం రూ. సుమారు 2 కోట్ల తో నిర్మించిన పాఠశాల భవనాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ మా నాయనమ్మ ఊరు కామారెడ్డి దగ్గరలో స్వంతగా నిర్మిస్తున్నామని, అలాగే మా అమ్మమ్మ ఊరు కోదురుపాకలో కూడా నిర్మిస్తున్నామని వెల్లడించారు. సీఎం కేసీఆర్ న్నాయకత్వంలో కొన్ని పథకాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయన్నారు. దేశంలోనే ఎక్కడా లేనంతగా తెలంగాణలో 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని, అలాగే రైతు బంధు, రైతు భీమా అందిస్తున్నామన్నారు. 75 ఏళ్లలో ఏ ప్రభుత్వం చేయని పని ఇంటికీకి నల్లా నీరు ఇస్తున్నామని, ప్రతి పేద వాడికి 200 నుండి 2000 ఫించన్లు ఇస్తున్నామన్నారు. మన ఊరు..మన బడి కార్యక్రమంలో భాగంగా 7300 పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పించి పూర్తిగా ఆధునీకరిస్తూన్నామన్నారు.   
పేద వాడికి విద్య వైద్యం ముఖ్యం..ఆ ఆదిశగా ముందుకు వెళ్తున్నామని.. 4 లక్షల మందికి పైగా జిల్లా లో హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేశామని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో విద్య, వైద్యం కోసం సర్కార్ పెద్ద పీట వేస్తోందని, రాష్ట్రంలోనే విద్య వైద్య లో రాజన్న సిరిసిల్ల జిల్లా ముందంజలో ఉండాలని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు.