IPS పూరన్ కుమార్ ఫ్యామిలీకి అండగా ఉంటాం: ఎంపీ మల్లు రవి

IPS పూరన్ కుమార్ ఫ్యామిలీకి అండగా ఉంటాం: ఎంపీ మల్లు రవి

న్యూఢిల్లీ, వెలుగు: దళిత ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ కుటుంబానికి అండగా ఉంటామని ఎంపీ మల్లు రవి అన్నారు. ఆత్మహత్యకు కారణమైన డీజీపీ, ఇతర పోలీస్ అధికారులపై వెంట‌‌‌‌‌‌‌‌నే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేర‌‌‌‌‌‌‌‌కు బుధవారం ప్రధాని కార్యాలయంలో లేఖను అందజేశారు. అనంతరం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌‌‌‌‌‌‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘‘హర్యానాలో తెలంగాణకు చెందిన దళిత ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అధికారుల ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు. 

ఇది చాలా దురదృష్టకరం. అధికారి సూసైడ్‌‌‌‌‌‌‌‌కు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని అన్ని రాష్ట్రాల సీఎస్‌‌‌‌‌‌‌‌లు, డీజీపీలకు ఆదేశాలివ్వాలి. ఐపీఎస్ అధికారి సూసైడ్ ఘటనను కమిటీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్తాను. నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్‌‌‌‌‌‌‌‌కు కూడా లేఖను పంపిస్తాను”ఆయన తెలిపారు.

శ్రీశైలం ఎలివేడెట్ కారిడార్ కోసం ప్రధానికి లేఖ..

మన్ననూర్ నుంచి శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు 765 నేషనల్‌‌‌‌‌‌‌‌ హైవే ప్రాజెక్టు గురించి గతంలో సీఎం, ఎంపీలందరం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశామ‌‌‌‌‌‌‌‌ని మల్లు రవి పేర్కొన్నారు. తాజాగా ఇదే ప్రాజెక్టు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి.. ప్రధాని మోదీకి లేఖ రాశారని గుర్తుచేశారు. త‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌ పార్లమెంట్ నియోజకవర్గంలో దీని నిర్మాణం జరగనుండటంతో తాను కూడా ప్రధానికి లేఖ రాశానని చెప్పారు. 

ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.800 కోట్లు అవుతుందని, ఆ మొత్తాన్ని మంజూరు చేయాలని కోరామ‌‌‌‌‌‌‌‌ని వివరించారు. అలాగే, అచ్చంపేట సమీపంలోని మద్దిమడుగు నుంచి మాచర్లను కలిపే బ్రిడ్జి నిర్మణానికి సంబంధించిన అంశాన్ని కూడా లేఖలో పేర్కొన్నామని చెప్పారు. ఈ బ్రిడ్జి కృష్ణా నదిపై నిర్మించాల్సి ఉందని, ఇంటర్ స్టేట్ కనెక్టివిటీ స్కీమ్ కింద దీని నిర్మాణానికి నిధులు కేటాయించాలని సీఎం రాసిన లేఖలో కోరారని చెప్పారు.