
కేఆర్ఎంబీపై అసెంబ్లీలో తీర్మానం పెట్టాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. అసెంబ్లీలో తీర్మానం చేస్తే మేం మద్దతిస్తామంటూ చెప్పారు. ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగించడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు కవిత. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం నుండి తక్షణమే ఈ తీర్మానాన్ని పంపాలని ప్రభుత్వాన్ని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. మరోవైపు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ స్పీకర్ ను కోరగా.. వారి విజ్ఞతను స్పీకర్ తిరస్కరించారు.