కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉంటాం ...తెలంగాణ పొలిటీషియన్స్ జేఏసీ

కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉంటాం ...తెలంగాణ పొలిటీషియన్స్ జేఏసీ

బషీర్​బాగ్, వెలుగు: సామాజిక న్యాయం అనే ఎజెండాతో పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉంటామని తెలంగాణ పొలిటీషియన్స్ జేఏసీ తెలిపింది. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో జేఏసీ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు. 

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై సీబీఐ విచారణకు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తామని తెలిపారు.