బీసీ బిల్లుకు సపోర్ట్ చేసే పార్టీలకే మద్దతిస్తం : ఆర్. కృష్ణయ్య

బీసీ బిల్లుకు సపోర్ట్ చేసే పార్టీలకే మద్దతిస్తం :  ఆర్. కృష్ణయ్య

బషీర్ బాగ్, వెలుగు :  బీసీ బిల్లుకు సపోర్ట్ చేసే పార్టీలకే తాము మద్దతిస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో 14 బీసీ సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ... బీజేపీ బీసీని సీఎం అభ్యర్థిగా ప్రకటించడం గర్వకారణమని, కానీ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బీసీలను గుర్తించకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. సమర్థులైన బీసీ నేతలు ఉన్నప్పటికీ వారికి తగిన టికెట్లు కేటాయించకుండా అన్యాయం చేశారని తెలిపారు. 

బీసీలకు బీఆర్ఎస్ కేవలం 23 సీట్లు ఇస్తే.. కాంగ్రెస్ 20 సీట్లు మాత్రమే కేటాయించి అన్యాయం చేయడంలో మరో అడుగు ముందుకేసిందని ఎద్దేవా చేశారు.