ఎల్‌‌ఆర్‌‌‌‌ఎస్ ద్వారా విదేశాల్లో..భారీగా ఆస్తుల కొనుగోళ్లు

ఎల్‌‌ఆర్‌‌‌‌ఎస్ ద్వారా విదేశాల్లో..భారీగా ఆస్తుల కొనుగోళ్లు
  • షేర్లు, బాండ్లు కూడా కొనేందుకు ఎగబడుతున్న ఇండియన్లు 

న్యూఢిల్లీ: భారతీయులు విదేశాల్లో ప్రాపర్టీలు, గ్లోబల్ కంపెనీల షేర్లు, బాండ్లు కొనడం భారీగా పెరిగింది. ఈ ఏడాది జనవరి– సెప్టెంబర్‌‌‌‌లో  లిబరలైజ్డ్‌‌ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్‌‌ఆర్ఎస్‌‌) ద్వారా భారతీయులు ప్రాపర్టీల కొనుగోలుకు చేసిన ఖర్చు  ఏడాది లెక్కన 80 శాతం పెరిగి 350 మిలియన్ డాలర్లకు చేరుకుంది.  షేర్లు, డెట్‌‌ ఆస్తుల్లోకి వెళ్లిన పెట్టుబడులు 50 శాతం వృద్ధి చెంది 1.68 బిలియన్ డాలర్లకు ఎగిశాయి. 

మొత్తంగా ఈ ఏడాది జనవరి– సెప్టెంబర్‌‌‌‌ మధ్య  ఇండియా నుంచి  ఎల్‌‌ఆర్‌‌‌‌ఎస్ ద్వారా విదేశాల్లో 2 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులు జరిగాయి. కిందటేడాది మొత్తంలో జరిగిన ఇన్వెస్ట్‌‌మెంట్స్‌‌తో పోలిస్తే 55 శాతం గ్రోత్ నమోదైంది. ఎల్‌‌ఆర్‌‌‌‌ఎస్ ద్వారా ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తి  2,50,000 డాలర్లను విదేశాలకు పంపొచ్చు. సంస్థలు, ట్రస్టులు  ఈ స్కీమ్ ద్వారా ఫండ్స్ పంపడానికి అవ్వదు. 

ప్రజల ఆలోచన విధానాలు మారాయని, ఫైనాన్షియల్ నాలెడ్జ్ పెరగడంతో ధనవంతులు  పెట్టుబడులకు ఇతర మార్గాలను వెతుకుతున్నారని వెల్త్‌‌మేనేజర్లు పేర్కొన్నారు. దుబాయ్‌‌లో  ప్రాపర్టీలను  కొనేందుకు ఇండియన్ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు.