ఎయిర్‌‌ పొల్యూషన్‌కు పాకెట్‌ సొల్యూషన్‌

ఎయిర్‌‌ పొల్యూషన్‌కు పాకెట్‌ సొల్యూషన్‌

కరోనా మొదలైనప్పటి నుంచి మాస్క్‌ పెట్టుకోవడం ఒక అలవాటుగా అయింది. మాస్క్​ వల్ల నోరు, ముక్కు మూసుకుపోయి గాలి పీల్చుకోవడానికి కష్టంగా అనిపించినా కూడా,  కరోనా వైరస్‌ బారినపడకుండా ఉండేందుకు మాస్క్‌ తప్పనిసరి అయింది. ఇప్పుడు అంత కష్టపడాల్సిన పని లేదు. ఎందుకంటే ముక్కులో ఇమిడిపోయేంత చిన్న ఎయిర్​ ప్యూరిఫైయర్‌‌ మార్కెట్‌లోకి వచ్చేసింది.ఢిల్లీ ఐఐటికి చెందిన స్టార్టప్‌‌ ‘నానోక్లీన్‌‌ గ్లోబల్‌‌’ ప్రపంచంలోనే అతి చిన్న వేరబుల్‌‌ ఎన్‌‌95 గ్రేడ్‌‌ ఎయిర్‌‌‌‌ ప్యూరిఫైయర్‌‌‌‌ ని తయారుచేసింది. దీనికి ‘నాసో95’ అని పేరు పెట్టింది. ఇది తయారుచేసినందుకు స్టార్టప్ ​ ఇండియా​ అవార్డు కూడా ఇచ్చారు. చూడ్దానికి ఇయర్‌‌‌‌టిప్స్‌‌లా ఉండే ఈ ఎయిర్‌‌‌‌ ప్యూరిఫయర్‌‌‌‌ ముక్కులో పెట్టుకునేంత చిన్నగా ఉంటుంది. ఇది మాస్క్‌‌లాగానే కాదు, ఎయిర్‌‌‌‌ ఫిల్టర్‌‌‌‌గా పనిచేస్తుంది. దీని వల్ల ఊపిరి పీల్చుకున్నపుడు దుమ్ము, వైరస్, బ్యాక్టీరియా వంటివి శరీరంలోకి చేరవు. ఎన్‌‌95 మాస్క్‌‌ అంత పవర్‌‌‌‌ఫుల్ ఈ నాసో95 ప్యూరిఫయర్. 

ఈ ఎయిర్‌‌‌‌ ప్యూరిఫయర్‌‌‌‌ సేఫ్టీ

నాసో95 ఎయిర్‌‌‌‌ ప్యూరిఫయర్‌‌‌‌ మాస్క్‌‌లా వదులు కాదు. అందరికి ఫిట్‌‌ అయ్యేలాగ నాలుగు సైజ్‌‌లలో ఉంది. అన్ని వయసుల వారికి సెట్‌‌ అవుతుంది. జాతీయ, అంతర్జాతీయ ల్యాబ్‌‌ల్లో చాలారకాల టెస్ట్స్‌‌ చేసి ఈ ఎయిర్‌‌‌‌ ప్యూరిఫయర్‌‌‌‌ సేఫ్టీ అని సర్టిఫై చేశారు. వైరస్‌‌ కన్నా ప్రమాదమైనది ఎయిర్‌‌‌‌ పొల్యూషన్‌‌. పొల్యూషన్‌‌ వల్ల లంగ్‌‌ సమస్యలే కాకుండా.. క్యాన్సర్‌‌‌‌ కూడా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎయిర్‌‌‌‌ ప్యూరిఫయర్‌‌‌‌గా నాసో95 ఇందుకు చాలా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా ఫేస్ ఐడెంటిటీ చూపించేటప్పుడు ముఖానికి ఉన్న మామూలు మాస్క్‌‌లు తీయాల్సి వస్తుంది. నాసో95తో ఆ ప్రాబ్లమ్‌‌ ఉండదని కంపెనీ అంటోంది. ఇవి ఆన్‌‌లైన్‌‌లో రూ. 500 నుంచి అందుబాటులో ఉన్నాయి.  నానోక్లీన్‌‌ గ్లోబల్‌‌ కంపెనీ సెక్రెటరీ రాజేష్‌‌ మాట్లాడుతూ ‘డిపార్ట్‌‌మెంట్‌‌ ఆఫ్‌‌ సైన్స్‌‌ అండ్‌‌ టెక్నాలజీ బోర్డ్‌‌తో మాట్లాడాం. మా ఎయిర్‌‌‌‌ ప్యూరిఫయర్‌‌‌‌ ఇన్వెన్షన్‌‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేం దుకు సపోర్ట్‌‌ చేయాలని అడిగాం’ అని చెప్పాడు.