రఘునాథపల్లి/ భీమదేవరపల్లి/ పర్వతగిరి (సంగెం, గీసుగొండ), వెలుగు: బైకర్స్ హెల్మెట్ ధరిస్తేనే ప్రాణాలకు రక్షణ ఉంటుందని వెస్ట్‌జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్, ఘన్‌పూర్ ఏసీపీ భీమ్‌శర్మ, కాజీపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రాణాలను కాపాడాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రతా ప్రచారంలో భాగంగా మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన ప్రోగ్రామ్‌లో ఆఫీసర్లు మాట్లాడారు.
జనగామ జిల్లా రఘునాథపల్లి పోలీసుల ఆధ్వర్యంలో కొమల్ల టోల్ ప్లాజా వద్ద హెల్మెట్ వినియోగంపై అవగాహన కార్యక్రమం చేపట్టగా, వెస్ట్ జోన్ డీసీపీ, ఘన్‌పూర్ ఏసీపీ హాజరై మాట్లాడారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండల పరిధిలోని కొత్తపల్లిలో నిర్వహించిన అవేర్నెస్ ప్రోగ్రామ్‌లో కాజీపేట ఏసీపీ పాల్గొని హెల్మెట్‌తో ఉపయోగాలను వివరించారు. వరంగల్ జిల్లా సంగెం మండల కేంద్రంలో పర్వతగిరి సీఐ రాజగోపాల్ ఎస్సై వంశీకృష్ణ, గీసుగొండ మండలం ఊకల్ సెంటర్లో సీఐ విశ్వేశ్వర్ వాహనదారులకు అవగాహన కల్పించారు.
