
ఎండల తీవత్ర మరో మూడు రోజుల పాటు క్రమంగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గురు, శుక్ర, శని వారాల్లో 43 డిగ్రీలు దాటే అవకాశం ఉందని అంచనా వేశారు. తర్వాత క్రమంగా ఎండల తీవ్ర తగ్గి, పగటి పూట ఉష్ణోగ్రతలు 40కి పడిపోయే అవకాశం ఉందని, ఈ సమయంలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని వాతావరణ అధికారులు తెలిపారు. మూడు రోజుల తర్వాత అంటే 12, 13, 14 తేదీల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని తెలిపారు.