
- వరంగల్ జిల్లా కల్లెడలో 10 సెం.మీ. వర్షపాతం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పలుచోట్ల బుధవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. వరంగల్ జిల్లాలోని కల్లెడలో 10 సెంటీమీటర్లు, ఏనుగల్‌లో 9.6, సంగెంలో 7.6, సూర్యాపేటలోని మామిళ్లగూడెంలో 6.1, వరంగల్‌లోని చెన్నారావుపేటలో 4.8, ఖమ్మంలోని గుబ్బగుర్తిలో 4.7, భద్రాద్రి కొత్తగూడెంలోని నాగుపల్లిలో 4.6 సెం.మీ. చొప్పున వర్షపాతం రికార్డయింది. రాష్ట్రంలోని అనేక చోట్ల రానున్న మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ద్రోణి ప్రభావంతో వర్షాలు
దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక నుండి రాయల సీమ, తెలంగాణ మీదుగా దక్షిణ ఛత్తీస్ ఘడ్ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. ఈ ద్రోణి కారణంగా రాష్ట్రంతో పాటు హైదరాబాద్ సిటీ లోను పలు చోట్ల వర్షం పడుతోంది.