
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. వేడిగాలుల ప్రభావం మరింత పెరిగింది. విదర్భ ప్రాంతంలో కిలోమీటర్ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, రానున్న మూడ్రోజుల పాటు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వైకే రెడ్డి తెలిపారు. ఆదివారం అత్యధికంగా భద్రాచలంలో 38.6 డిగ్రీల ఉష్ణో గ్రత నమోదైంది . నిజామాబాద్ 38.6, మెదక్ 38.2, ఆదిలాబాద్ 38, ఖమ్మం 37, హైదరాబాద్, నల్గొండలో 36.4 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. రోజురోజుకీ ఎండలెక్కువైతున్న క్రమంలో పిల్లలు, వృద్ధులు వడదెబ్బ బారిన పడకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్లర్లు.