- రోజుకు 20 గంటలు శ్రమించి 12 రోజుల్లో పూర్తి
- గురువారం ఎదుర్కోలు వేడుకలో అందజేత
పద్మారావునగర్, వెలుగు: భద్రాచలం సీతారాముల కల్యాణానికి సికింద్రాబాద్‌కు చెందిన నేత కార్మికుడు ఎస్.ఎస్. జయరాజ్ పట్టు వస్త్రాలను అందజేశారు. ఆయన ఆరుగురు నేత కార్మికులతో కలిసి భద్రాచలం ఆలయ ప్రాంగణంలోనే మగ్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 12న నేతను ప్రారంభించగా, రోజుకు 20 గంటలు శ్రమించి ఈ నెల 24 రాత్రికల్లా పూర్తిచేశారు. గురువారం ఎదుర్కోలు వేడుకలో సీతాదేవికి రెండు పట్టు చీరలు, శ్రీరాముడు, లక్ష్మణుడు, హనుమంతుడికి అంగవస్త్రాలు, పంచెలను అప్పగించారు. జయరాజ్ కుటుంబం మూడు తరాలుగా సీతారాములకు పట్టు వస్త్రాలను అందజేస్తుండగా, ఐదేళ్లుగా జయరాజ్ బాధ్యతను నిర్వహిస్తున్నారు. ఈ వస్త్రాల తయారీకి సుమారు రూ.2 లక్షలు ఖర్చు అయ్యాయి.
