అల్లు వారి ఇంట పెళ్లిసందడి మొదలైంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చిన్న కుమారుడు శిరీష్ పెళ్లికి రెడీ అయ్యాడు. బ్యాచిలర్ లైఫ్ కు బై బై చెప్పి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. తన చిరకాల ప్రేయసితో కలిసి ఏడడుగులు వేసేందుకు సమయం ఆసన్నమైంది. ఇటీవల దుబాయ్ లో ప్రీవెడ్డింగ్ పార్టీ జరుపుకోగా.. ఇప్పుడు హైదరాబాద్ లోని తన ఇంట్లో పసుపు ఫంక్షన్ ను నిర్వహించారు.
అల్లు ఇంట పెళ్లి సందడి..
పెళ్లి తంతు ప్రారంభోత్సవంలో భాగంగా గురువారం అల్లు అరవింద్ నివాసంతో పసుపు దంచుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ విషయాన్ని స్వయంతో శిరీష్ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ వేడుకకు చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత, రామ్ చరణ్ సతీమణి ఉపాసన, పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా, అల్లు అర్జున్ సతీమణి స్నేహ , మిగతా బంధువులు హాజరయ్యారు.
సంప్రదాయబద్ధంగా..
సాధారణంగా హల్దీ ఫంక్షన్ పేరుతో చాలామంది గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ సింఫుల్ గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంట్లో సంప్రదాయబద్ధంగా పసుపు దంచుడు కార్యక్రమానికి చేసుకున్నారు. మెగా - అల్లు కుటుంబం సభ్యులు కలిసి జరుపుకున్న ఈ వేడుకకు సంబంధించిన వీడియోలో నెట్టింట వైరల్ అవుతున్నాయి. అల్లు శిరీష్ కు శుభాకాంక్షలు చెబుతున్నారు ఫ్యాన్ సంబరాలు చేసుకుంటున్నారు.
ముహూర్తం ఎప్పుడంటే?
అల్లు శిరీష్ తన వివాహ తేదీ విషయంలో ఒక ఆసక్తికరమైన విషయం దాగి ఉంది.. మార్చి 6, 2026న ఈ జంట వివాహం జరగనుంది. ఇక్కడ విశేషమేమిటంటే, అదే రోజు అల్లు అర్జున్ – స్నేహారెడ్డిల పెళ్లి రోజు కూడా. అన్నయ్య మ్యారేజ్ డే రోజే తమ్ముడు కూడా పెళ్లి చేసుకోవడం అల్లు కుటుంబంలో ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోనుంది. గతేడాది అక్టోబర్ 31న వీరి నిశ్చితార్థం అత్యంత వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే...
