
- ఉత్తర్వులు జారీ చేసిన కార్మిక శాఖ
హైదరాబాద్, వెలుగు: వాణిజ్య కేంద్రాల్లో ఉద్యోగులు పనిచేసే వర్క్ టైమింగ్స్ లో పలు సవరణలు చేస్తూ కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ జీవో 282 ను జారీ చేశారు. ఇందులో భాగంగా రోజుకు పది గంటలు, వారంలో 48 గంటల వర్క్ అవర్స్ మించొద్దని తెలంగాణ షాప్స్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ 1988లో ప్రభుత్వం ఈ సవరణలు చేసింది.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా ఈ సవరణలు చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ టైమింగ్స్ దాటితే ఓటీ కింద అదనపు వేతనం చెల్లించాలన్నారు. ఒక రోజులో 6 గంటల పనివేళలో కనీసం అరగంట రెస్ట్ ఇవ్వాలని, రెస్ట్ టైమింగ్స్ తో కలిపి 12 గంటల కంటే ఎక్కువ పనిచేయించవద్దని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది.