వార ఫలాలు (సౌరమానం) 21.05.2023 నుంచి 27.05.2023 వరకు

వార ఫలాలు (సౌరమానం) 21.05.2023 నుంచి 27.05.2023 వరకు

మేషం
ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. యత్నకార్యసిద్ధి. పరపతి పెరుగుతుంది. వాహనాలు, స్థలాలు కొంటారు. నూతన ఉద్యోగప్రాప్తి. మీ సేవలకు తగిన గుర్తింపు పొందుతారు. ఆహ్వానాలు అందుతాయి.  వ్యాపారులకు నూతనోత్సాహం, పెట్టుబడులు లభిస్తాయి. ఉద్యోగులు  చిక్కులు అధిగమిస్తారు. వారాంతంలో వృథా ఖర్చులు. దూరప్రయాణాలు.

వృషభం
కార్యక్రమాల్లో అవరోధాలు అధిగమిస్తారు. పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు ఉత్సాహంగా ఉంటుంది. వాహనయోగం. పాతస్నేహితులను కలుసుకుంటారు.  వ్యాపారులకు అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు అనుకూల వాతావరణం, ప్రమోషన్లు దక్కుతాయి. వివాదాలు పరిష్కారమవుతాయి. వారం మధ్యలో
మానసిక అశాంతి. కుటుంబంలో సమస్యలు.
మిథునం
నూతన వ్యక్తుల పరిచయం. అనుకోని ప్రయాణాలు. కొన్ని వివాదాలు, సమస్యల నుంచి బయటపడతారు. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. దేవాలయాలు సందర్శిస్తారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి.  వ్యాపారులకు తగిన లాభాలు. ఉద్యోగులకు  పూర్వవైభవం. వారారంభంలో అనారోగ్య సూచనలు. స్నేహితులతో తగాదాలు.
కర్కాటకం
పరిస్థితులు అనుకూలిస్తాయి. ముఖ్య కార్యక్రమాలలో విజయం. శుభకార్యాలలో పాలుపంచుకుంటారు. వాహనసౌఖ్యం. అదనపు ఆదాయం సమకూరే సమయం. విద్యార్థులకు కొత్త అవకాశాలు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ఇంటి నిర్మాణ యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ఉద్యోగాల్లో చిక్కులు తొలుగుతాయి. వారాంతంలో అనుకోని ప్రయాణాలు. అప్పులు చేస్తారు.
సింహం
పరపతి పెరుగుతుంది. అనుకున్న కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. ఆత్మీయులు, బంధువుల నుంచి శుభవర్తమానాలు. ఆస్తి వివాదాలు, ఇతర సమస్యలు తీరతాయి. వాహనసౌఖ్యం. ధనలబ్ధి. మాటల చాతుర్యంతో అందర్నీ ఆకట్టుకుంటారు. విద్యార్థులకు అప్రయత్నంగా అవకాశాలు దక్కుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వారం మధ్యలో వృథా ఖర్చులు. చికాకులు.
కన్య
ప్రతికూల పరిస్థితులు కూడా అనుకూలంగా మారతాయి. నైపుణ్యం, ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. రాబడి ఆశాజనకం.  కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. చిన్ననాటి స్నేహితులను కలుస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారులు మరింతగా లాభాలు పొందుతారు. ఉద్యోగులకు ప్రమోషన్లు రావొచ్చు. వారాంతంలోదూరప్రయాణాలు.
ఆరోగ్యసమస్యలు.
తుల
దూరపు బంధువుల నుంచి శుభవార్తలు. ఆదాయం మరింత ఆశాజనకం. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అనుకున్న కార్యక్రమాలు సజావుగా పూర్తి అవుతాయి. నూతన పరిచయాలు. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. వ్యాపారులకు సానుకూలమైన కాలం. ఉద్యోగులు సత్తా చాటుకుంటారు. వారం మధ్యలో వృథా ఖర్చులు. బంధువిరోధాలు.
వృశ్చికం
ఆదాయం ఆశాజనకం. కొత్త కార్యక్రమాలు పూర్తి చేస్తారు. చిన్ననాటి స్నేహితులు కనపడతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సన్నిహితుల సాయంతో ముందుకు సాగుతారు. ఆహ్వానాలు అందుకుంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వాహనసౌఖ్యం. వ్యాపారులు ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగస్తుల చిరకాల స్వప్నం నెరవేరుతుంది. దూరప్రయాణాలు. కుటుంబంలో సమస్యలు.
ధనుస్సు
అదనపు ఆదాయం సమకూరుతుంది.వివాదాలు సర్దుబాటు కాగలవు. చేపట్టిన కార్యక్రమాలలో విజయం. ఆస్తుల వ్యవహారంలో చిక్కులు అధిగమిస్తారు. విద్యార్థులు ఆశించిన అవకాశాలు అందుకుంటారు. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. వ్యాపారులు ఆశించిన పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగులకు మంచి గుర్తింపు రాగలదు. వృథా ఖర్చులు. వారం మధ్యలో మానసిక ఆందోళన. 
మకరం
కష్టానికి  తగిన ఫలితం ఉండదు. కార్యక్రమాలలో అవాంతరాలు.  ఆస్తి వివాదాలు. ఆరోగ్య సమస్యలు. కొన్ని నిర్ణయాలు పునఃసమీక్షించుకుంటారు. వాహనాల విషయంలో నిర్లక్ష్యం వద్దు. ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి. వ్యాపారులకు కొంత గందరగోళ పరిస్థితి నెలకొంటుంది. ఉద్యోగుల బాధ్యతలు పెరుగుతాయి. వారారంభంలో శుభవర్తమానాలు. వస్తులాభాలు.
కుంభం
ఆదాయం ఆశాజనకం. వివాదాలు సర్దుబాటు కాగలవు. చేపట్టిన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు. ఆస్తి విషయంలో చిక్కులు తొలగుతాయి. కాంట్రాక్టులు దక్కించుకుంటారు.  శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపారులకు కోరుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. వారాంతంలో అనుకోని ఖర్చులు. దూరప్రయాణాలు. శారీరక రుగ్మతలు.
మీనం
అదనపు ఆదాయం. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. మీ ఆలోచనలు, ప్రతిపాదనలు కుటుంబసభ్యులు అంగీకరిస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. కొత్త పనులకు శ్రీకారం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులు పైస్థాయి పోస్టులు దక్కుతాయి. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో తగాదాలు..


వక్కంతం చంద్రమౌళి
జ్యోతిష్య పండితులు
ఫోన్​: 98852 99400