
వారఫలాలు: జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. మేషరాశి నుంచి .. మీనరాశి వరకు ఈ వారం ( సెప్టెంబర్28 నుంచి అక్టోబర్ 4 వరకు ) రాశి ఫలాలను తెలుసుకుందాం.
మేషరాశి : ఈ వారం ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. ప్రేమ.. పెళ్లి విషయాల్లోఎలాంటి ఇబ్బందులు ఉండవు.
వృషభరాశి: ఈ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. పాత స్నేహితులు కలవడంతో ఎంజాయి చేస్తారు. ఉద్యోగస్తులకు.. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులు గుడ్ న్యూస్ వింటారు. ఉద్యోగం మారాలనుకునే వారికి ఈ వారం మంచి సమయం. వ్యాపారాలు విస్తరించే అవకాశం ఉంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు . ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.
మిథునరాశి: ఈ రాశి వారికి ఈ వారం చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. అనవసర ఖర్చులను నియంత్రించుకోండి. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
కర్కాటక రాశి : ఈ వారం ఈ రాశి వారు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దని పండితులు సూచిస్తున్నారు. ఇతరులతో చాలా తక్కువుగా మాట్లాడండి. మీ నిర్ణయాన్ని ఎక్కడ బహిరంగ పరచవద్దని పండితులు సూచిస్తున్నారు. ఉద్యోగస్తులు మీ ప్రమేమం లేకుండానే అవమానాలు ఎదుర్కొంటారు. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని పండితులు సూచిస్తున్నారు. వారం చివరిలో పరిస్థితులు అనుకూలిస్తాయి. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలకు దూరంగా ఉండండి.
సింహరాశి: ఈ రాశి వారికి ఈ వారం ఎలాంటి ఇబ్బందులు ఉండవు. గతంలో రావలసిన బకాయిలు వసూలవులాయి. ఆస్తివివాదాలు పరిష్కారమవుతాయి. ఈ వారం కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ వస్తుంది. వ్యాపారస్తులకు అనుకోని లాభాలు కలుగుతాయి. కొత్త ప్రాజెక్ట్లు చేపట్టే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు.
కన్యారాశి: ఈ రాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరగడంతో పాటు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. అనవసర ఖర్చుల్ని చాలావరకు నియంత్రించుకోవాలి. ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.
తులా రాశి: ఈ వారం కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బంధువులు.. మిత్రులతో విబేధాలు ఏర్పడేందుకు అవకాశం ఉంది. ఎవరితోనూ ఎలాంటి వాదనలు పెట్టుకోవద్దు. చాలా ఓపికగా, జాగ్రత్తగా పనిచేస్తే అంతా నార్మల్‌గా ఉంటుంది. వారం మధ్యలో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతనతో గడపండి. ఎలాంటి ఆందోళన అవసరం లేదు.. అంతా మంచే జరుగుతుంది.
వృశ్చికరాశి: ఈ రాశి వారికి ఈ వారి అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. గతంలో ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులుపెట్టేందుకు అనుకూల సమయమని పండితులు చెబుతున్నారు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి.
ధనుస్సురాశి: ఈ వారం ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీ పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు కొద్దిపాటి ఇబ్బందులు వస్తాయి. మాట పట్టింపునకు పోకుండా మీ పని మీరు చేసుకోండి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. స్నేహితుల రాకతో ఖర్చులు పెరుగుతాయి. భూముల కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండండి.
మకర రాశి : ఈరాశి వారు ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో మీ ఆర్థిక సమస్యలు పెరగవచ్చు. కుటుంబంలో వివాదాలు కూడా ఉండవచ్చు. చాలా తెలివిగా వ్యవహరించండి. అనుకోకుండా బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు సీనియర్లతో విబేధాలు ఏర్పడుతాయి. సహోద్యోగుల సహకారం అంతగా ఉండదు. వ్యాపారస్తులకు నష్టాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు.
కుంభ రాశి : ఈ రాశి వారికి ఈ వారం ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. బంధువులతో అనుకోకుండా గొడవలు ఏర్పడుతాయి. . ఈ సమయంలో మీ కోపాన్ని నియంత్రించుకోవడం చాలా అవసరమని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.కార్యాలయంలో ఎవరితో వాదనలు పెట్టుకోవద్దు. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిదని పండితులు సూచిస్తున్నారు. ప్రేమ... పెళ్లి విషయాలను తాత్కాలికంగా వాయిదా వేయండి.
మీన రాశి: ఈ రాశి వారు ఈ వారం గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటారు. అనుకోకుండా కెరీర్ లో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. మీ శత్రువులు మీపై విజయం సాధించే అవకాశాలున్నాయి. ప్రతి పని విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అనవసరంగా డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు దాపురిస్తాయి. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిదని పండితులు సూచిస్తున్నారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ప్రేమ.. పెళ్లి విషయాలను తాత్కాలికంగా వాయిదా వేయండి.