వారఫలాలు అక్టోబర్ 15 నుంచి 21 వరకు

వారఫలాలు అక్టోబర్ 15 నుంచి 21 వరకు

మేషం  

పొరపాట్లు సరిదిద్దుకుని కొన్ని కార్యాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. చిరకాల ప్రత్యర్థులను ఆకట్టుకుంటారు. ఆస్తుల వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. కోర్టు వ్యవహారం అనుకూలిస్తుంది. ఖ్యాతి విస్తరిస్తుంది.  కుటుంబంలో వివాహయత్నాలు సానుకూలం. వాహనాలు, భూములు కొంటారు. ఇతరులకు సాయపడతారు. వ్యాపారులకు అనుకోని లాభాలు. ఉద్యోగులకు హోదాలు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, క్రీడాకారులకు కొత్త ఆశలు చిగురిస్తాయి.

వృషభం 

దీర్ఘకాలిక సమస్యలు కొన్ని పరిష్కారం. ఆదాయం గతం కంటే మరింత మెరుగ్గా ఉంటుంది. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. భూములు, వాహనాలు కొంటారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. మాటలతో అందర్నీ మెప్పిస్తారు. వ్యాపారులకు ఊహించని పెట్టుబడులు. ఉద్యోగులకు విశేష గుర్తింపు రాగలదు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు చేజారిన అవకాశాలు తిరిగి దక్కుతాయి.

మిథునం 

చేపట్టిన కార్యక్రమాలు కొన్ని విజయవంతంగా సాగుతాయి. ఆలోచనలకు కార్యరూపం. రాబడి పెరుగుతుంది. తరచూ ప్రయాణాలు. సోదరులు, సోదరీలతో వివాదాలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఆస్తి విషయాలలో సమస్యలు తీరతాయి. గృహం, వాహనాలు కొంటారు. నూతన ఉద్యోగాలు దక్కే అవకాశం. వ్యాపారులకు కోరుకున్న లాభాలు. ఉద్యోగులకు నూతనోత్సాహం. రాజకీయవేత్తలు, కళాకారులు, పరిశోధకులకు శ్రమ ఫలిస్తుంది.

కర్కాటకం 

అనుకున్న కార్యాలు దిగ్విజయంగా సాగుతాయి. స్థిరాస్తి విషయంలో చిక్కులు తొలగుతాయి. వాహనసౌఖ్యం. మీ నిర్ణయాలను అందరూ హర్షిస్తారు. కొన్ని సంస్థల్లో సభ్యత్వాలు స్వీకరిస్తారు. మాటల చాతుర్యంతో అందర్నీ ఆకట్టుకుంటారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారులకు అనుకున్న విధంగా లాభాలు. ఉద్యోగులకు అనుకూల సమయం. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, పరిశోధకులకు కొన్ని ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు.

సింహం 

కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. ఆదాయం ఆశాజనకం. ముఖ్య వ్యవహారాలు సజావుగా పూర్తి. మీ నిర్ణయాలు అందర్నీ మెప్పిస్తాయి. విద్యార్థులకు ఆశించిన ఫలితాలు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఆహ్వానాలు అందుకుంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం. వ్యాపారులకు నూతన పెట్టుబడులు. ఉద్యోగులకు హోదాలు పెరిగే అవకాశం. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రచయితలకు ఊహించని ఆదరణ.

కన్య 

ముఖ్యమైన కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆదాయ, వ్యయాలు సమానం. ఆశయాల సాధనలో ఆప్తుల సహకారం అందుతుంది. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి ప్రముఖులతో పరిచయాలు. ఇంతకాలం కఠినంగా వ్యవహరించిన వారు సైతం అనుకూలురుగా మారతారు. వ్యాపారులు లాభాల బాట పడతారు. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి పారిశ్రామికవేత్తలు, కళాకారులు, క్రీడాకారులకు ఒత్తిడులు కొంత తగ్గుతాయి.

తుల 

ఆదాయానికి ఏమాత్రం లోటు రాదు. ఎంతో కాలంగా వేధిస్తున్న సమస్యలు తీరతాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడవచ్చు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. చిరకాల ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు. ఆస్తుల కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారులకు పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు కొత్త అవకాశాలు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు అనుకున్నది సాధిస్తారు.

వృశ్చికం 

ఇంతకాలం పొదుపు చేసిన మొత్తాలు చేతికందుతాయి. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. మీ ఆశయాలు, లక్ష్యాలు నెరవేరే సమయం. మనసులో అనుకున్నది తక్షణం జరిగి ఉత్సాహంగా గడుపుతారు. నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారులకు ఈతిబాధలు తొలగుతాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరం. రాజకీయవేత్తలు, క్రీడాకారులు, కళాకారులకు మరింత బాగుంటుంది.

ధనుస్సు 

ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. అందరిలో గుర్తింపు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఆస్తుల వ్యవహారాల్లో ఒడిదుడుకులు తొలగుతాయి. కుటుంబసభ్యులతో వివాదాలు సద్దుమణుగుతాయి. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. యుక్తితో కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. వాహన, గృహ కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారులకు పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు పనిఒత్తిడుల నుంచి విముక్తి. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రచయితలకు కలసివస్తుంది.

మకరం 

మీ కష్టానికి ఫలితం దక్కుతుంది. చేపట్టిన కార్యాలు విజయవంతం. ఆలోచనలకు కార్యరూపం. భవిష్యత్తుపై నిరుద్యోగులకు భరోసా. వేడుకలు, సమావేశాలకు హాజరవుతారు. ఆస్తులపై నూతన ఒప్పందాలు. తండ్రి తరఫు వారి నుంచి ధనలబ్ధి. ఖర్చులు పెరిగినా డబ్బుకు లోటు ఉండదు. పలుకుబడి పెరుగుతుంది. సమాజంలో ప్రత్యేక గుర్తింపు. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు. ఉద్యోగులకు ప్రమోషన్లు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఆకస్మిక విదేశీ పర్యటనలు.

కుంభం 

 చేపట్టిన కార్యాలు సకాలంలో పూర్తి. ఆదాయం ఆశాజనకం. రుణభారాలు తొలగుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. సమాజంలో ప్రత్యేక గుర్తింపు. భూముల కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి. మాటలతో ఆకట్టుకుంటారు. ఇంటి నిర్మాణాల్లో పురోగతి. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వ్యాపారులకు ఊహించని లాభాలు దక్కే అవకాశం. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు రావచ్చు. రాజకీయవేత్తలు, కళాకారులు, రచయితలకు విజయాలు వరిస్తాయి.

మీనం 

పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం. ఆదాయం పెరుగుతుంది. కొన్ని రుణాలు తీరతాయి. చిరకాల ప్రత్యర్థులను ఆకట్టుకుంటారు. నూతన విద్య, ఉద్యోగావకాశాలు. సంగీత, సాహిత్య విషయాలపై ఆసక్తి. చేపట్టిన కార్యక్రమాలు నిదానించినా పూర్తి చేస్తారు. వాహన సౌఖ్యం. వ్యాపారాలు లాభసాటి. కొత్త భాగస్వాముల చేరిక సంతోషం కలిగిస్తుంది. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయవేత్తలు, కళాకారులు, క్రీడాకారులకు మరింత ఉత్సాహం.

వక్కంతం చంద్రమౌళి జ్యోతిష్య పండితులు ఫోన్​: 98852 99400