పోలీసులకు వీక్లీ ఆఫ్‌ అమలు చేస్తాం: హోం మంత్రి సుచరిత

పోలీసులకు వీక్లీ ఆఫ్‌ అమలు చేస్తాం: హోం మంత్రి సుచరిత

అమరావతి: రాష్ట్రంలో పోలీసులకు వీక్లీ ఆఫ్‌ని అమలు చేస్తామని హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఆదివారం సచివాలయంలో ఆమె  మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికడతామన్నారు. శాంతిభద్రతలు కాపాడి ప్రజలకు భరోసా కల్పిస్తామని చెప్పారు. మహిళా బెటాలియన్, గిరిజన బెటాలియన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. మహిళల భద్రత కోసం ప్రత్యేక టోల్‌ ఫ్రీ నెంబర్‌ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థను తీసుకొస్తామన్నారు. దళిత మహిళకు హోంమంత్రి పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు