
హైదరాబాద్, వెలుగు: నగరానికి చెందిన వీ ఎక్సెల్ ఎడ్యు ప్రైవేట్ లిమిటెడ్ దీర్ఘకాలిక, వ్యూహాత్మక లక్ష్యాలకు అనుగుణంగా విలీనం, కొనుగోలు చేయడానికి లేదా ఇతర మార్పుల చేయడం కోసం స్టాంపీడ్ క్యాపిటల్ లిమిటెడ్ (స్కాప్ డీవీఆర్) సంస్థ సంబంధిత సంస్థల నుంచి సూత్రప్రాయంగా ఆమోదం పొందింది. డబ్ల్యూఈఎక్స్ఎల్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్(డబ్ల్యూఈఎక్స్ఎల్) ఈక్విటీ విలువను నిర్ణయించడానికి కంపెనీ పీడబ్ల్యుసీ బిజినెస్ కన్సల్టింగ్ సర్వీసెస్ ఎల్ఎల్పీని నియమించింది.
స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు, ఇతర విద్యా సంస్థలకు వీ ఎక్సెల్ డిజిటల్ ప్లాట్ ఫారాలను అందిస్తుంది. త్వరలో మరిన్ని స్కూళ్లకు సేవలు అందించనుంది. వాల్యూ అనాలిసిస్ ప్రకారం డబ్ల్యూఈఎక్స్ఎల్ ఈక్విటీ విలువ రూ.91 కోట్ల నుంచి రూ.101 కోట్ల మధ్య ఉంటుంది.