వెయిట్ లాస్ స్టడీ లెటెస్ట్ రిపోర్టు: పిస్తాతో బరువు తగ్గొచ్చు

వెయిట్ లాస్ స్టడీ లెటెస్ట్ రిపోర్టు: పిస్తాతో బరువు తగ్గొచ్చు

బరువు తగ్గడానికి  డైట్​ ప్లాన్స్ చాలానే ట్రై చేస్తుంటారు. గంటలు గంటలు జిమ్స్​లో  వర్కవుట్స్​ కూడా చేస్తుంటారు. అయితే అంత కష్టం లేకుండా  తేలిగ్గా బరువు తగ్గే ఉపాయాల్లో  పిస్తా తినడం ఒకటి అంటున్నారు రీసెర్చర్​లు.

బ్రేక్​ఫాస్ట్​లో పిస్తా పప్పులు చేరిస్తే బరువులో తేడా మీరే గమనిస్తారని గ్యారంటీ కూడా ఇస్తున్నారు వాళ్లు.

పిస్తా పప్పుల్లో క్యాలరీలు తక్కువగా, ప్రొటీన్​​ అండ్​ ఫైబర్​ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇవి రెండూ ఆకలిని తగ్గిస్తాయి. తక్కువ తినేలా చేస్తాయి.

ఈ విషయం  పన్నెండు వారాల పాటు  చేసిన వెయిట్​ లాస్​ ప్రోగ్రామ్​ అనే  స్టడీలో తేలింది.

ఇందులో భాగంగా వలంటీర్లలో కొందరికి రోజుకు  53 గ్రాముల పిస్తాపప్పులు తినిపించారు. అవి తిన్న వాళ్ల బాడీ మాస్ ఇండెక్స్ రోజుకు 56గ్రాముల జంతికలు తిన్న మరికొందరు వాలంటీర్లతో  పోలిస్తే రెండింతలు తగ్గింది. ఒబెసిటీతో బాధపడేవాళ్లపై జరిపిన మరో స్టడీలో ప్రతిరోజూ పిస్తా తినేవాళ్లకి నడుము భాగం సన్నగా అయినట్టు తేలింది.. అందుకని  బరువు తగ్గాలనుకునేవాళ్లు ఇకనుంచి పిస్తాని డైట్​లో చేర్చండి

for more News….

కరెంటు పోల్​ ఎక్కడం కోసం.. కోర్టు మెట్లెక్కి గెలిచింది

మొక్కల పెంపకంలో కొత్త ట్రెండ్ మొదలుపెట్టిన రిటైర్డ్ టీచర్

దేశంలోని మహిళా సంపన్నుల్లో 10మంది హైదరాబాదీలు

for Live Updates watch v6 news Live