బరువు తగ్గడానికి పిస్తా

బరువు తగ్గడానికి పిస్తా

బరువు తగ్గాలి అనుకునేవాళ్ల డైట్​లో నట్స్​, డ్రై ఫ్రూట్స్​ కచ్చితంగా ఉండాలి. ముఖ్యంగా పిస్తాలో ఫైబర్​ ఎక్కువ ఉంటుంది. మిగతా నట్స్​తో పోల్చితే వీటిలో క్యాలరీలు తక్కువ ఉంటాయి. అందుకే వీటిని తింటే పొట్ట నిండుగా ఉండి, తొందరగా ఆకలి వేయదు. దాంతో బరువు తగ్గడం ఈజీ అవుతుంది అంటున్నారు న్యూట్రిషనిస్ట్​లు. పిస్తాతో మరిన్ని లాభాలున్నాయి. అవేంటంటే...

  •   పిస్తాలోని విటమిన్​–బి6 హెమోగ్లోబిన్​ తయారీకి చాలా అవసరం. రక్తంలో చక్కెర పెరగకుండా చూస్తుంది కూడా. 
  •   కళ్ల మీద బ్లూ లైట్​ ప్రభావం కనిపించకూడదంటే పిస్తా తినాలి. 
  •   ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫినాల్స్​ ఇమ్యూనిటీని పెంచుతాయి. గుండె జబ్బుల ముప్పుని కూడా తగ్గిస్తాయి.