ఇంటర్ స్టూడెంట్లకు వెల్కమ్ కిట్.. కాలేజీ తెరిచిన రోజే బుక్స్, యూనిఫామ్, నోట్బుక్స్..

ఇంటర్ స్టూడెంట్లకు వెల్కమ్ కిట్.. కాలేజీ తెరిచిన రోజే బుక్స్, యూనిఫామ్, నోట్బుక్స్..
  • పేద విద్యార్థులపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకే ఈ నిర్ణయం
  • వచ్చే ఏడాది ఫస్టియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 1.20 లక్షల అడ్మిషన్లే టార్గెట్

హైదరాబాద్, వెలుగు: సర్కారు కాలేజీల్లో అడ్మిషన్లు పెంచడమే లక్ష్యంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు ‘వెల్​కమ్ కిట్’అందించాలని డిసైడ్ అయింది. యూనిఫామ్, నోట్ బుక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తదితరాలను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. కాలేజీ ప్రారంభమైన తొలి రోజే వీటిని సంబంధించిన కిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను స్టూడెంట్లకు ఇచ్చేందుకు ఇంటర్మీడియేట్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కార్పొరేట్ కాలేజీలకు దీటుగా సర్కారు కాలేజీల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తూనే.. వసతులు కల్పిస్తూ, పేద విద్యార్థులను ఆకట్టుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

 రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 430 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉండగా, వాటిలో సుమారు 1.72 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ ఏడాది ఫస్టియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొత్తగా 91 వేల మంది చేరారు. అయితే, వచ్చే ఏడాది ఈ సంఖ్యను మరింత పెంచాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఫస్టియర్ అడ్మిషన్లను 1.20 లక్షలకు చేర్చడమే లక్ష్యంగా పెట్టుకొని పని చేస్తున్నారు. ఫిజిక్స్ వాలా, ఎడ్ టెక్ తదితర సంస్థల ద్వారా విద్యార్థులకు జేఈఈ, నీట్, ఎప్ సెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు క్లాట్ శిక్షణ ఇస్తున్నారు. 

తొలిసారిగా యూనిఫామ్.. 

విద్యార్థులకు ఇచ్చే వెల్​కమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మొత్తం నాలుగు రకాల వస్తువులు ఉండనున్నాయి. తెలుగు అకాడమీకి చెందిన పాఠ్య పుస్తకాలతో పాటు నోట్ బుక్స్, ఒక జత యూనిఫామ్, సబ్జెక్టుల ప్రాక్టీస్ కోసం వర్క్ బుక్ ఈ కిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంటాయి. అడ్మిషన్ తీసుకొని కాలేజీకి వచ్చిన మొదటి రోజే వీటిని పంపిణీ చేయనున్నారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులందరికీ ఒకే రకమైన యూనిఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అందించాలని ఇంటర్మీడియెట్ కమిషనరేట్ అధికారులు నిర్ణయించారు. 

అలాగే, ఇంటర్ విద్యా సంవత్సరాన్ని ఇకపై ముందుగానే ప్రారంభించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఐసీఎస్ఈ, సీబీఎస్ఈ తరహాలో ఎగ్జామ్స్ పూర్తయిన 15 రోజులకే క్లాసులు స్టార్ట్ చేయాలని కమిషనరేట్ యోచిస్తోంది. దీని అనుమతి కోసం ప్రభుత్వానికి ఇంటర్మీడియెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిషనర్ కృష్ణ ఆదిత్య ప్రతిపాదనలు పంపినట్టు తెలిసింది. సాధారణంగా టెన్త్ ఫలితాలు వచ్చాక జూన్‍లో క్లాసులు మొదలవుతాయి. కానీ ఇకపై ఆ ఆలస్యం లేకుండా, ఎగ్జామ్స్ అయిన వెంటనే క్లాసులు మొదలుపెట్టడం ద్వారా సిలబస్ త్వరగా పూర్తి చేయొచ్చని, తద్వారా విద్యార్థులకు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు ఎక్కువ టైం దొరుకుతుందని అధికారులు భావిస్తున్నారు.

ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే పుస్తకాలు రెడీ.. 

కాలేజీ ప్రారంభం రోజునే ఇంటర్ విద్యార్థులకు వెల్ కమ్ కిట్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సర్కారు ఆదేశాలకు అనుగుణంగా పుస్తకాలతో పాటు యూనిఫామ్, టెక్ట్స్ బుక్స్, నోట్ బుక్స్ అందిస్తాం. ఈ ఏడాది మారిన సిలబస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అనుగుణంగా కొత్త పుస్తకాలను ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి తీసుకొస్తాం. పేద, మధ్య తరగతి విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడంతో పాటు వారిపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. 
- కృష్ణ ఆదిత్య, ఇంటర్మీడియెట్ కమిషనర్