రిస్క్ చేయొద్దు బీఆర్ఎస్​కే ఓటేయాలే : ముఠా గోపాల్

రిస్క్ చేయొద్దు  బీఆర్ఎస్​కే ఓటేయాలే : ముఠా గోపాల్

ముషీరాబాద్, వెలుగు: తొమ్మిదన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందిందో అందరికీ తెలిసిందేనని ఆ పార్టీ ముషీరాబాద్ సెగ్మెంట్ అభ్యర్థి ముఠా గోపాల్ తెలిపారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలోని మిగతా రాష్ట్రాల్లో లేవన్నారు.

ఎన్నికల సమయంలో రిస్క్ చేయొద్దని.. మరోసారి బీఆర్ఎస్​కు ఓటేయాలని ఆయన కోరారు. గురువారం ముషీరాబాద్ సెగ్మెంట్​లో బోలక్​పూర్ డివిజన్ బూత్ స్థాయి సమావేశం జరగగా.. ముఠా గోపాల్ చీఫ్ గెస్టుగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారన్నారు. యువ నేత జయసింహ మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలపై ఇంట్లో చర్చించి ఓటు వేయాలని కోరారు. మాయమాటలు చెప్పే ఇతర పార్టీలను నమ్మి మోసపోవద్దన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు ప్రశాంత్, మోజస్, బొట్టు శ్రీను తదితరులు పాల్గొన్నారు.