
మెదక్ టౌన్, వెలుగు: నియోజకవర్గంలోని అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందించాలని ఎమ్మెల్యే రోహిత్‌రావు అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన మెదక్ కలెక్టరేట్లో కలెక్టర్ రాహుల్‌రాజ్‌తో కలిసి వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అభివృద్ధిలో మెదక్‌ను అగ్రభాగన నిలపాలన్నారు. అధికారులు వారికి నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిచేసి సహకరించాలన్నారు. మెదక్, రామయంపేట మున్సిపాలిటీల పరిధిలో శుభ్రత విషయంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని కమిషనర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రాబోయే సమావేశాల్లో మార్పు కనిపించాలని సూచించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలపై అధికారులకు పలు సూచనలు, సలహాలు అందిస్తున్నామని, నిర్దేశించిన లక్ష్యాలను సాధించే దిశగా పటిష్ట చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో అడిషనల్కలెక్టర్నగేశ్, అధికారులు భుజంగరావు, ఎల్లయ్య, యాదయ్య, శశికళ, హైమావతి, విజయలక్ష్మి, సురేశ్ రెడ్డి, విజయ్ కుమార్, ప్రతాప్‌సింగ్, రాధాకిషన్, శ్రీరామ్, ఆర్డీవో రమాదేవి, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
టీజేఎఫ్ రజతోత్సవ పోస్టర్ఆవిష్కరణ
తెలంగాణ జర్నలిస్టుల ఫోరం (టీజేఎఫ్) రజతోత్సవ వేడుకల పోస్టర్‌ను ఎమ్మెల్యే రోహిత్ రావు యూనియన్ ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. హైదరాబాద్ జలవిహార్ లో నిర్వహించే రజతోత్సవ సభకు జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సక్సెస్చేయాలని ఆ సంఘం జిల్లా కన్వీనర్ సురేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.