బెంగాల్‌లో రెండు వారాలు లాక్‌డౌన్

బెంగాల్‌లో రెండు వారాలు లాక్‌డౌన్

కోల్‌కతా: కరోనా కేసులు పెరుగుతుండటంతో పశ్చిమ బెంగాల్ లో రెండు వారాలు లాక్ డౌన్ విధించారు. ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకు లాక్ డౌన్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. ఈ టైమ్ లో కేవలం ఎమర్జెన్సీ సేవలకు మాత్రమే మినహాయింపు ఇస్తున్నట్లు బెంగాల్ ప్రభుత్వం తెలిపింది. హెల్త్ కేర్, ఫైర్ సర్వీసులు, కోర్టులను మినహాయించి మిగతా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలు మూసేసి ఉంటాయని సర్కార్ స్పష్టం చేసింది. నిన్న ఒక్క రోజే బెంగాల్ లో 20 వేల పైచిలుకు పాజిటివ్ కేసులు నమోదవ్వడం, వైరస్ బారిన పడి 136 మంది చనిపోవడంతో దీదీ సర్కార్ లాక్ డౌన్ పెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది.