2025 World Cup: తృటిలో వరల్డ్ కప్‌కు అర్హత కోల్పోయిన వెస్టిండీస్.. తట్టుకోలేక గ్రౌండ్‌లోనే కన్నీళ్లు

2025 World Cup: తృటిలో వరల్డ్ కప్‌కు అర్హత కోల్పోయిన వెస్టిండీస్.. తట్టుకోలేక గ్రౌండ్‌లోనే కన్నీళ్లు

వెస్టిండీస్ మహిళల జట్టు ఐసీసీ వన్డే వరల్డ్ కప్ కు అర్హత సాధించడంలో విఫలమైంది. క్వాలిఫయర్ మ్యాచ్ లో థాయిలాండ్ పై  భారీ తేడాతో గెలిచినా ఫలితం లేకుండా పోయింది. వెస్టిండీస్ వరల్డ్ కప్ కు అర్హత సాధించాలంటే టార్గెట్ ను 10.1 ఓవర్లలో ఛేజ్ చేయాలి. ఓ వైపు థాయిలాండ్ 166 పరుగులు చేసి విండీస్ ముంగిట 167 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. మొదట స్కాట్లాండ్ బ్యాటింగ్ తర్వాత విండీస్ వరల్డ్ కప్ కు సాధ్యం కావడం దాదాపుగా ఆసాధ్యంగానే భావించారు. ఓవర్ కు 17 పరుగుల చొప్పున కొట్టాలంటే ఏ జట్టుకైనా కష్టమే. 

వెస్టిండీస్ విజయం నల్లేరుపై నడకే అయినా 61 బంతుల్లో ఛేజ్ చేస్తేనే వారు వరల్డ్ కప్ కు అర్హత సాధిస్తారు. ఈ దశలో విండీస్ మహిళల జట్టు అసాధారణంగా పోరాడింది. అసలు ఆశలే లేవనుకుంటున్న తరుణంలో అద్భుతంగా పోరాడింది. కెప్టెన్ హీలే మ్యాథూస్ సంచల ఇన్నింగ్స్ ఆడింది. 29 బంతుల్లోనే 70 పరుగులు చేసి గెలుపుపై ఆశలు పెంచింది. మ్యాథ్యుస్ కు తోడు జట్టులో ప్రతి ఒక్కరు వచ్చిన వారు వచ్చినట్టు పోరాడడంతో 10.4 ఓవర్లలో 168 పరుగులు చేసి మ్యాచ్ గెలిచింది. మరో మూడు బంతుల ముందు టార్గెట్ ఫినిష్ చేసి ఉంటే విండీస్ వరల్డ్ కప్ కు అర్హత సాధించి ఉండేది.

వరల్డ్ కప్ కు అర్హత సాధించకలేకపోవడంతో వెస్టిండీస్ మహిళా క్రికెటర్లు గ్రౌడ్ లోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. క్వాలిఫయర్ లో భాగంగా మొత్తం ఆరు జట్లలో టాప్ 2 లో నిలిచిన పాకిస్థాన్, బంగ్లాదేశ్ మహిళలు వరల్డ్ కప్ కు అర్హత సాధించాయి. పాకిస్థాన్ ఆడిన 5 మ్యాచ్ ల్లో గెలవగా.. బంగ్లాదేశ్, వెస్టిండీస్ మూడు మ్యాచ్ లు గెలిచి 6 పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. నెట్ రన్ రేట్ తో వెస్టిండీస్ ను వెనక్కి నెట్టి బంగ్లాదేశ్ అర్హత సాధించింది. భారత్ వేదికగా 2025 సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 26 వరకు వన్డే వరల్డ్ కప్ జరుగుతుంది.